టాలీవుడ్‌లో సురేష్‌బాబు క‌లిసి ప‌ని చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు... దేనిని కూడా ఓ ప‌ట్టాన తెమ‌ల్చ‌డు అన్న‌ది టాక్ ఉంది. ఏదేమైనా చిన్న లాభం కూడా లేనిదే ఆయ‌న ఏ ప‌ని ఎవ్వ‌రికి చేయ‌డ‌న్న టాక్ ఉంది. ఇక ఇప్పుడు వెంకీమామ సినిమా ఆయ‌న చేతుల్లో బందీ అయిపోయి అటు బ‌య‌ట‌కు రాలేక పోతోంద‌ని టాక్‌.. ? ఈ సినిమాను నిర్మించిన పీపుల్స్ మీడియా వ్యవహారం పాపం, కక్కలేక, మింగలేక అన్నట్లుగా తయారైంది. ఇప్ప‌టికే ఈ సంస్థ సురేష్‌బాబుతో క‌లిసి రెండు సినిమాలు తీసింది. అయితే ఆ రెండు సినిమాల వ్య‌వ‌హారం వేరు.. త‌క్కువ బ‌డ్జెట్‌.. ముందే రైట్స్ అమ్మేశారు.. మంచి లాభాలు వ‌చ్చాయి. ఇప్పుడు వెంకీ మామ వ్య‌వ‌హారం మాత్రం ఓ ప‌ట్టాన తేల‌డం లేదు.

 

సురేష్ బాబు - పీపుల్స్ బ్యాన‌ర్ క‌లిసి చేసిన సినిమాల్లో మొదటి సినిమా నేనేరాజు-నేనే మంత్రి కి నాన్ థియేటర్ హక్కులు బాగా వచ్చాయి. థియేటర్ మీద రిస్క్ తక్కువ వుంది. అందువల్ల సినిమాను సురేష్ బాబు చేతిలో పెట్టినా గట్టెక్కిపోయారు. రెండోది స‌మంత చేసిన ఓ బేబీ. ఈ సినిమా మీద కూడా  థియేట్రిక‌ల్ రైట్స్ రిస్క్ త‌క్కువుగా ఉండ‌డంతో పాటు సినిమాకు మంచి వ‌సూళ్లు రావ‌డంతో ఇబ్బంది లేదు.

 

ఇక ఇప్పుడు మూడో సినిమా అయినా వెంకీమామ అలా కాదు. ఈ సినిమా బ‌డ్జెట్ దగ్గర దగ్గర 48 కోట్లకు చేరింద‌ట‌. పోనీ నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ బిజినెస్ కూడా బాగోలేద‌ట‌. శాటిలైట్ అయింది. డిజిటల్ బేరాలు సాగుతున్నాయి. హిందీ మార్కెట్ పడిపోయింది. అస‌లు ఈ సినిమా హిందీ రైట్స్ కొనేందుకు కూడా ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేద‌ట‌. ఇక ఇప్పుడు రు.35 కోట్ల‌తో థియేట‌ర్ రైట్స్ కొనేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు.. ఇప్పుడు ఓన్ రిలీజ్‌కు వెళ్లాలంటే భారీ రిస్కే.

 

ఇక సినిమాకు స‌రైన డేట్ కూడా లేదు. సంక్రాంతికి సినిమాలు, ఫిబ్రవరి సినిమాలు, మార్చి సినిమాలు డేట్ లు వేసుకున్నాయి కానీ వెంకీమామ డేట్ వేసుకోలేకపోయింది. ఇప్పటికి డిసెంబర్ 13, డిసెంబర్ 25, జనవరి 3 అంటూ రరకాల డేట్ లు వినిపిస్తున్నాయి. దీంతో అటు పీపుల్స్  వాళ్లు సురేష్‌బాబు దెబ్బ‌తో విల‌విల్లాడుతున్న‌ట్టు ఇండ‌స్ట్రీ టాక్‌..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: