టాలీవుడ్‌లో గ‌త నాలుగైదు నెలలుగా స‌రైన సినిమాలు రాలేద‌న్న‌ది వాస్త‌వం. ఈ నాలుగు నెల‌ల పాటు ఇండ‌స్ట్రీలో చెప్పుకునేందుకు ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా కూడా లేకుండా పోయింది. ప్ర‌తి వారం రెండు మూడు చిన్న సినిమాలు రిలీజ్ అవ్వ‌డం.. వారానికే అవి చాప చుట్టేయ‌డం జ‌రిగిపోయింది. ఇంకా చెప్పాలంటే గ‌త రెండు మూడు నెల‌ల్లో కోలీవుడ్ డ‌బ్బింగ్ సినిమాలు విజిల్ - ఖైదీ - యాక్ష‌న్ కొంత బెట‌ర్ అనిపించాయి.

 

ఇక ఇప్పుడు డిసెంబ‌ర్ నెల రాబోతోంది. డిసెంబ‌ర్ నుంచి వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు టాలీవుడ్‌లో థియేట‌ర్లు కొత్త సినిమాల‌తో ప్ర‌తి వారం కిక్కిరిసి పోనున్నాయి. జనవరి లో సంక్రాంతికి ముందు డిసెంబర్ చివరి వారంలో మీడియం రేంజ్ హీరోలంతా మీడియం బడ్జెట్ సినిమాల‌తో పోటా పోటికిదిగుతారు. డిసెంబర్ చివరిలో బాలకృష్ణ రూలర్, ప్రతి రోజు పండగే, డిస్కో రాజాలు దిగుతున్నాయి. మరి మూడు సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న సినిమాలే.

 

ఇక నితిన్ భీష్మ కూడా డిసెంబర్ లోనే అన్నారు కానీ… చివరికి నితిన్ భీష్మ ఫిబ్రవరికి వెళ్ళిందిగా అంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ వరల్డ్ ఫెమస్ లవర్ ని హడావిడీ లేకుండా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున దింపుతున్నాడు. అదే డేట్‌కు నితిన్ భీష్మ‌, దిల్ రాజు 96 సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. ముందుగా ఫిబ్ర‌వ‌రి 14కు విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ్ ఫిక్స్ అయ్యింది.

 

ఇప్పుడు శర్వానంద్ – సమంత 96, నితిన్ భీష్మ లు అదే రోజు వ‌స్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాయి. ఈ మూడు సినిమాలు మంచి క్రేజీ సినిమాలే. ఇక సంక్రాంతి సినిమాల హంగామా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముందుగా ర‌జ‌నీకాంత్ ద‌ర్బార్ జ‌న‌వ‌రి 10న లైన్లో ఉంది. ఆ వెంట‌నే 11న మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌స్తుంటే.. ఒక్క రోజు తేడాలో 12న అల వైకుంఠ‌పురంలో రిలీజ్ కానుంది. సంక్రాంతి రోజున క‌ళ్యాణ్‌రామ్ స‌రిలేరు నీకెవ్వ‌రు రిలీజ్ అవుతోంది. ఏదేమైనా డిసెంబ‌ర్ నుంచి ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు వ‌రుస సినిమాల‌తో థియేట‌ర్లు కిక్కిరిసిపోనున్నాయి. మ‌రి ఈ సినిమాల్లో ఏది స‌త్తా చాటుతుందో ?  చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: