సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా టీజర్ ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసినదే. భరత్ అనే నేను మహర్షి ఇలాంటి రెండు సూపర్ హిట్ సినిమాల తర్వాత మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల మరియు ఇండస్ట్రీలో అంచనాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 22 వ తారీకు న విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ లో రచ్చ రచ్చ చేస్తుంది.

 

మహేష్ బాబు సరికొత్త తరహాలో డైలాగ్ డెలివరీ టైప్ అదిరిపోయే మాస్ రేంజ్ లో చెప్పడం తో ఈ సినిమా టీజర్ కి సినిమా ప్రేమికులు మరియు మహేష్ బాబు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో సినిమా టీజర్ విడుదల మొట్ట మొదటి రోజు అత్యధిక వ్యూస్ సినిమా టీజర్ రికార్డు గా యూట్యూబ్ లో సరికొత్త రికార్డు సృష్టించగా తాజాగా మొట్ట మొదటి రోజు నుండి ఆ రికార్డు కొనసాగిస్తూ… ఓ రిమార్కబుల్ ఫీట్ అధిగమించింది ఈ టీజర్.

 

ఇప్పటిదాకా టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా మరో రికార్డును కూడా బ్రేక్ చేసింది. విడుదలైన దగ్గర నుండి యూట్యూబ్ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. 100 గంటలు గడిచినా అస్సలు దిగేదే లేదన్నట్లుగా సరిలేరు నీకెవ్వరు అదే స్థానంలో ట్రెండ్ అవుతోంది.  ఇప్పటివరకు ఇండస్ట్రీగా ఇటువంటి రికార్డు ఏ స్టార్ సినిమా హీరో క్రియేట్ చేయలేదని...మొట్టమొదటిసారి మహేష్ బాబు క్రియేట్ చేయడం జరిగింది అని ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమా తో టాలీవుడ్ బాక్సాఫీస్ హ్యాట్రిక్ కొట్టే ఆలోచనలో మహేష్ ఉన్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో మహేష్ బాబు ఆర్మీ జవాన్ పాత్రలో కనిపించబోతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: