సౌత్ సినీ ఇండస్ట్రీలోని సీనియర్ నటులందరూ కలిసి ప్రతి ఏడాది గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటూ దానికి 80’s రీయూనియన్ అని పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పదేళ్లుగా ఈ సెలబ్రేషన్స్ ను దక్షిణాది భాషా నటులు జరుపుకుంటున్నారు. స్థాయి, బేధ, తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి ఓ ప్లేస్ అనుకుని మీట్ అవుతున్నారు. ఈసారి ఈ రీయూనియన్ కార్యక్రమం పదో వార్షికోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన కొత్త ఇంట్లో ఏర్పాటు చేశారు. కొందరు తప్ప అప్పటి నటులందరూ కలిసి హాజరై తమ మధురానుభూతులను పంచుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందని సీనియర్ నటుడొకరు చిరంజీవిని తప్పబట్టారు.

 

 

ఎనభై, తొంబైల్లో దక్షిణాది నటడు, దర్శకుడు కూడా అయిన ప్రతాప్ పోతన్ కు చిరంజీవి నిర్వహించిన రీయూనియన్ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. దీంతో ఆయన.. ‘చిరంజీవికి నేను గుర్తు లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశా నేను ఆయన దృష్టిలో మంచి నటుడు, దర్శకుడిని కాకపోవచ్చు. అందుకే నన్ను పిలవలేదనుకుంటా’ అని తన సన్నిహితులతో అని బాధపడుతున్నాడట. నిజానికి చిరంజీవి గత పదేళ్లుగా ఈ రీయూనియన్ కార్యక్రమానికి క్రమం తప్పకుండా హాజరవుతున్నాడు. మరి.. ఈ కార్యక్రమానికి నిజంగానే ప్రతాప్ పోతన్ ను మర్చిపోయాడా లేక కావాలనే పిలవలేదో ఎవరికీ తెలీని విషయం. దీంతో ప్రతాప్ పోతన్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.

 

 

ప్రతాప్ పోతన్ తెలుగు, తమిళ, మళయాళ సినిమాల్లో నటించాడు. ప్రముఖ సీనియర్ హీరోయిన్ రాధిక మొదటి భర్త ప్రతాప్ పోతన్. తర్వాత వీరిరువురూ విడాకులు తీసుకున్నారు. ప్రతాప్ పోతన్ తెలుగులో నాగార్జున హీరోగా 1991లో వచ్చిన చైతన్య సినిమాకు దర్శకుడు కూడా. ఇలా ఈయన ఎనభైయ్యవ దశకం నటుడే. చిరంజీవి నిజాం ప్రతాప్ పోతన్ ను పిలవకపోతే ఆయన బాధను అర్ధం చేసుకోవాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: