సినిమాల విడుదలకు మంచి ముహూర్తం, మంచి రోజులు, మంచి సీజన్ ఎంతో ముఖ్యం. ఇందుకు పిల్లలకు సెలవలు, పండుగ సీజన్లు ఎంతో ముఖ్యమైనవి. అయితే ఈసారి పండుగ, సెలవుల సీజన్ కాకుండా సినిమాలకు అన్ సీజన్ గా భావించే ఓ నెల మూడు సినిమాలకు ప్రత్యేక సీజన్ కాబోతోంది. ఫిబ్రవరి నెలను సినిమాలకు అన్ సీజన్ గా భావిస్తారు సినీ నిర్మాతలు. పిల్లలకు పరీక్షల కాలం కావటమే ఇందుకు కారణం. కానీ ఈసారి మూడు సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు.

 

 

విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు నిర్మాత వల్లభ సిద్ధమయ్యాడు. ఈ సినిమాను క్రాంతి మాధవ్ బుర్రా దర్శకత్వం వహించాడు. విజయ సరసన నలుగురు కథానాయికలు నటిస్తున్నారు. నితిన్రష్మిక నటించిన బీష్మ సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలున్నాయి. మరో క్రేజీ ప్రాజెక్ట్ శర్వానంద్సమంత కాంబినేషన్ లో వస్తున్న తమిళ 96 రీమేక్ సినిమాను ఫిబ్రవరి 21 లేదా 25న విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తమిళ మాతృకలో విజయ్ సేతుపతిత్రిష నటించారు. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాను ఇక్కడ రీమేక్ చేస్తున్నారు.

 

 

దీంతో ఈ మూడు సినిమాలతో ఫిబ్రవరి నెల సందడి చేయనుంది. ఈ మూడు సినిమాలను పరిశీలిస్తే లవ్ జోనర్ లో వస్తున్న సినిమాలే. సింబాలిక్ గా ఫిబ్రవరి కూడా లవర్స్ కు ప్రత్యేకమైన నెల అనే చెప్పాలి. కాబట్టి ఈ మూడు ప్రేమకథలు ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: