క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఎటువంటి మొహమాట పడకుండా చాల స్పష్టంగా క్లారిటీతో మాట్లాడుతూ ఉంటాడు. లేటెస్ట్ గా విజయ్ గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో మాట్లాడుతూ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు షేర్ చేసాడు. 

తనకు చాల ‘పగ’ ఎక్కువనీ జీవితంలో నటించే వాళ్ళను చూస్తే తనకు చాల కోపం వస్తుందనీ కామెంట్స్ చేసాడు. తనకు వరస విజయాలు వస్తున్నాప్పుడు తన చుట్టూ తిరిగిన ఎంతోమంది వ్యక్తులు తనకు ఒక్క పరాజయం ఎదురవ్వగానే ఎటువంటి మొహమాటం లేకుండా ముఖం చాటేసిన సంఘటనలు తన జీవితంలో చాల ఉన్నాయని అలాంటి వారిని తాను జీవితంలో క్షమించను అంటూ అభిప్రాయ పడ్డాడు.

జీవితంలో మనిషి ప్రయాణించే ప్రతి దశలోనూ రాజకీయాలు ఉంటాయని డబ్బు ప్రస్తావన ఎక్కడ ఉంటే అక్కడ రాజకీయాలు ఉంటాయని అందువల్ల ఎవరైనా రాజకీయనాయకులను ద్వేషించడం అనవసరం అంటూ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో నిజాయితీ గురించి మాట్లాడుతూ ఒక వ్యక్తి నిజయితీగా బతకాలని ప్రయత్నిస్తే ఆ వ్యక్తి బతకడం చేతకానివాడు అంటూ అభిప్రాయపడే స్థితిలో సమాజం ఉన్నప్పుడు నిజాయితీ ఎలా బ్రతకగలుగుతుంది అంటూ కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు ఎంతో కష్టపడి తీసిన సినిమా బాగా లేదు అని చెప్పడం బదులు ఆ సినిమా ఎందుకు బాగా లేదో చెపితే అలాంటి సినిమాలు తాను నటించకుండా జాగ్రత్తపడతానని అయితే ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూసినా ద్వేషంతో కూడిన కామెంట్స్ తప్ప ఎక్కడా తనకు నిజాయితీ కనిపించడం లేదు అంటూ విమర్శలు చేసాడు. ఇదే సందర్భంగా ఫిలిం ఇండస్ట్రీలోని రాజకీయాల గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలోని రాజకీయాల స్థాయి రియల్ పోలిటిక్స్ మించి ఉంటున్నాయని ప్రస్తుతం డబ్బు విజయం ఉంటేనే గౌరవం ఇస్తున్నారానీ ఆ రెండు లేని వ్యక్తులు ఎంత ప్రతిభా వంతులైనా ‘అసమర్దులుగా’ ముద్ర వేస్తున్నారు అంటూ విజయ్ చేసిన కామెంట్స్ ప్రస్తుత వాస్తవ సమాజంలో నిజం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: