పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షంలోని ఒక పద్యాన్ని ప్రేరణగా తీసుకుని త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ అన్న టైటిల్ ఫిక్స్ చేసాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరొక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మూవీ కథలో     శ్రీకృష్ణుడి యాంగిల్ ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది.

కృష్ణుడు దేవకి కి పుట్టినా యశోద దగ్గర  పెరిగినట్లుగా ఆ పాయింట్ ను ఇప్పటి పరిస్థితులకు అన్వయించి బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టిన అల్లు అర్జున్ ను అతడి తల్లితండ్రులు ఒక పేద కుటుంబానికి అప్పచేప్పడంతో అక్కడ పెరుగుతాడు. అయితే ఆతరువాత అతడు తన కుటుంబ నేపధ్యం గురించి వాస్తవాలు తెలుసుకుని శ్రీకృష్ణుడు గోకులం నుండి ద్వారకకు వెళ్ళినట్లుగా బన్నీ తన పేద ఇంటి నుండి విలాసవంతమైన మహల్ లోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో భాగవతంలో శ్రీకృష్ణుడుకి ఎదురైనట్లుగానే అనేకమంది విలన్స్ బన్నీకి కూడ ‘అల వైకుంఠపురములో’ ఎదురైన విధానాన్ని చూస్తే ఎవరికైనా వెంటనే భాగవతం గుర్తుకు వస్తుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ కు పోతన భావగతం అంటే విపరీతమైన ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇప్పుడు ఈ మూవీని ఈ నాటి ప్రజలకు అర్ధంఅయ్యే సినిమా భాగవతంగా మార్చాడు అని అనుకోవాలి. నేటితరం వారికి పురాణాలు గురించి ఏమాత్రం తెలియని పరిస్థితులలో కనీసం ఈ మూవీ ద్వారా అయినా నేటి తరం ప్రేక్షకులకు పోతన భాగవతం గుర్తుకు వస్తుంది.

ఇప్పటికే ఈ మూవీలోని పాటలు అన్నీ యూత్ కు బాగా కనెక్ట్ అయిన పరిస్థితులలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చాల విభిన్నంగా చేసి ఈ మూవీ పై మరింత మ్యానియా పెంచాలని త్రివిక్రమ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. రొటీన్ ఫిలిం ఫంక్షన్స్ కు భిన్నంగా నేటితరం వారికి గజేంద్ర మోక్షం కథను గుర్తుకు వచ్చేలా ఒక క్లాసికల్ డాన్స్ కార్యక్రమాన్ని కూడ ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో త్రివిక్రమ్ చూపించబోతున్నట్లు టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: