మీ భార్య మీకు సుఖాన్ని అందించలేదా.. మిమ్మల్ని భాధపెడుతుందా అయితే వెంటనే మీరు చేయాల్సింది వేదిక లవ్ లైన్ వాడుకోవడం..ఈ కార్యక్రమంలో బార్య భాడితులకు భర్త భూదితులకు ఈ లవ్ లైన్ ఉపయోగపడుతుంది. అంటూ ఓ స్టార్ హీరోయిన్ ముందుకొచ్చింది.. హిరోయిన్ ఇలా మారిందెంటి అనుకోకండి.. సినిమా ప్రమోషన్ కోసం ఇదంతా చేస్తున్నారు..

 

అసలు వియమేమిటంటే..దాంపత్య సమస్యలన్నీ తీరిపోతాయని గ్యారెంటీ ఇస్తున్నారు బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్. ఆమె కథానాయికగా నటించిన సినిమా ‘పతి పత్ని ఔర్ వో’. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించారు. ఇందులో భూమి కార్తిక్ భార్య వేదిక పాత్రలో నటించారు. మరో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కార్తిక్ ప్రియురాలి క్యారెక్టర్‌లో నటించారు.

 

ఈ నేపథ్యంలో భూమి ‘వేదికా లవ్‌లైన్’ అనే క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. దీని ద్వారా భార్యాభర్తలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలను తీర్చగలుగుతానని అంటున్నారు. ‘ఇది ఫన్ సోషల్ మీడియా క్యాంపెయిన్. భార్య, భర్తలతో నేను మాట్లాడి వారి చిన్న చిన్న దాంపత్య సమస్యలను తీరుస్తాను. ‘పతి పత్ని ఔర్ వో’ సినిమాలో నేను భార్య పాత్రను పోషించాను. నాకు ఆ సమస్యలపై అవగాహన వచ్చింది అంటూ ఆమె షాక్ ఇచ్చింది..

 

ముదస్సర్ అజీజ్ డైరెక్ట్ చేశారు. 1978లో ఇదే టైటిల్‌తో వచ్చిన క్లాసిక్ సినిమాకు ఈ సినిమా సీక్వె్ల్‌గా రాబోతోంది. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. కాకపోతే ఇందులో కార్తిక్ ఆర్యన్ పెళ్లి తర్వాత జరిగే సెక్స్ గురించి చెప్పిన భారీ డైలాగ్ వివాదాస్పదమైంది. దాంతో ఈ డైలాగ్‌ను తొలగించేసినట్లు డైరెక్టర్ వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుందని అందరూ తప్పక చూడాలని ఆమె అంది..సినిమాలో నటించిన ఈమె ఇప్పుడు మరో హాట్ సినిమాలాల్లో నటిస్తూ వస్తుంది.. మరి ఈ సినిమా ఎంత హిట్ ఇస్తుందో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: