ఇప్పటిదాకా పవన్ సినిమాపాటల ఫై కన్నువేసిన నితిన్ ఇక ఏకంగా పవన్ సూపర్ హిట్ సినిమాఫై కూడా కన్ను వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. నితిన్ దర్శకుడు కరుణాకరన్ కాంబినేషన్ లో ఒక సినిమాకు రంగం సిద్ధమయింది అన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నితిన్ కి నాలుగైదు కథలు కరుణాకరన్ వినిపించినప్పటికి నితిన్ మాత్రం తన అభిమాన హీరో పవన్ రీమేక్ ని చేయటానికి ఆసక్తి చూపుతున్నాడని ఫిల్మనగర్ టాక్ . పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన తొలి ప్రేమ చిత్రాన్ని రీమేక్ చేయాలనే ఆలోచనతో నితిన్ ఉన్నాడని అందుకోసం పవన్ ఫర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాడని అంటున్నారు. పవన్ ఓకే చెపితే. నితిన్ నటించ పోయే తదుపరి సినిమా ఇదే అంటున్నారు. అలాగే ఈ సినిమాను తన సొంత బ్యానర్ పైన నిర్మిచే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు.  నితిన్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా 'హార్ట్‌ఎటాక్‌' చిత్రం విడుదల అయిన తరువాత ఈ సినిమా విషయంలో ఒక క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాలలో పవన్ కు దేముడు ఇచ్చిన తమ్ముడు గా నిరంతరం పవన్ నామస్మరణ చేస్తున్న నితిన్ కోరిక పవన్ మన్నిస్తే అది టాక్ ఆఫ్ ది టాలీవుడ్ న్యూస్ అవ్వడమే కాకుండా ఈ సినిమా నితిన్ కెరియర్ కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: