స్టైలిష్ స్టార్ కెరియర్ టర్న్ చేసిన సినిమా ఏది అంటే టక్కున చెప్పొచ్చు" ఆర్య" అని.  సుకుమార్ దర్శకత్వ వహించిన ఈ సినిమా అప్పట్లో యువతను కట్టిపడేసింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ఆర్య2 సినిమాను తెరకెక్కించారు.

 

సినిమా ఆర్య అంత హిట్ కాకపోయినా ఓ రేంజ్ సక్సెస్ అందుకుంది. ఆర్య 2 సినిమాతో  స్టైలిష్ స్టార్‌గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేశారు. నిజాయితీగా చెప్పాలంటే బన్నీని స్టైలిష్ స్టార్‌గా మార్చిన ఘనత కచ్చితంగా డైరెక్టర్ సుకుమార్‌కే చెందుతుంది.తన లాస్ట్ సినిమా రంగస్థలంతో అయితే సుకుమార్ దర్శకుడిగా తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఇంతలా తెలుగు నేటివిటీను చూపిస్తూ వచ్చిన సినిమా ఈమధ్య కాలంలో రాకపోవడంతో రంగస్థలానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

 

రంగస్థలం వంటి పెద్ద హిట్ ఇచ్చినా కానీ సుకుమార్ కు నెక్స్ట్ సినిమాను సెట్ చేసుకోవడానికి చాలా టైమ్ పట్టింది. ముందు మహేష్ తో సినిమా అనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. వెంటనే అల్లు అర్జున్ తో సినిమా కన్ఫర్మ్ అయింది కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బన్నీ బిజీగా ఉండడంతో సుకుమార్ మరికొన్ని నెలలు వెయిట్ చేయకతప్పలేదు.ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్నది దాదాపు కన్ఫర్మ్.

 

కాకపోతే అల్లు అర్జున్ పాత్ర పైనే ఇంకా క్లారిటీ లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే బ్యాచ్ కు నాయకుడిగా అల్లు అర్జున్ కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. 
ఇదిలా ఉంటే బన్నీ, సుకుమార్ కాంబోలో వచ్చిన ఆర్యా 2 సినిమా  పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యం లో బన్నీ ఓ ఎమోషనల్ ట్వీట్ పోస్ట్ చేసాడు. ‘సుక్కు జుట్టు రంగు మారిపోయింది. నా చర్మం మారిపోయింది. ప్రేమ మాత్రం మారలేదు. మా ఇద్దరి కలయిక నుంచి ఆ మ్యాడ్‌నెస్ ఎప్పటికీ మారదు. త్వరలోనే మీరూ చూస్తారు’’అని బన్నీ పోస్ట్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: