టాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వాళ్లలో రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి ఇద్దరూ ఉంటారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. సెన్సార్ బోర్డు కమ్మరాజ్యంలో కడప రెడ్లు టైటిల్ పై అభ్యంతరం తెలపడంతో వర్మ ఇప్పటికే టైటిల్ మార్చాడు. కానీ ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవటంతో వర్మ కోర్టును ఆశ్రయించాడు. 
 
కోర్టు వారం రోజుల్లోగా సినిమా చూసి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సినిమా వాయిదా పడింది. సినిమా రిలీజ్ డేట్ గురించి సెన్సార్ బోర్డ్ సినిమా చూసి సర్టిఫికెట్ జారీ చేసిన తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తమిళనాడు నుండి పోటీ చేయబోతున్నట్లు శ్రీరెడ్డి ప్రకటించారు. 
 
క్యాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హంగామా చేసి కొంతమంది హీరోలు, నిర్మాతల కొడుకులు, హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి కొంతకాలం నుండి సోషల్ మీడియా ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో వర్మకు డేటింగ్ ఆఫర్ ఇస్తున్నట్లుగా పోస్ట్ చేశారు. 
 
సోషల్ మీడియాలో శ్రీరెడ్డి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ పోస్టుపై తమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డి ఇచ్చిన ఆఫర్ ను అంగీకరిస్తాడో లేదో చూడాలి. అమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా ప్రమోషన్స్ లో రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డి ఇచ్చిన ఆఫర్ గురించి స్పందిస్తాడేమో చూడాల్సి ఉంది. ఇప్పట్లో అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సినిమా విడుదల కావటం కష్టమేనని కూడా వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: