తెలుగు సినీ పరిశ్రమలో యూత్ లో ప్రస్తుతం మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఫ్యాన్స్ ముద్దుగా రౌడీ స్టార్ అని పిలుచుకునే ఈ హీరో పెళ్లి చూపులుతో హిట్, అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్, గీత గోవిందంతో స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు. మిగిలిన హీరోలతో పోల్చుకుంటే ఆటిట్యూడ్ లో తనదైన స్టైల్ తో యూత్ ను అట్రాక్ట్ చేయడం విజయ్ స్పెషాలిటీ. ప్రస్తుతం విజయ్ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. దీని తర్వాత చేయబోయే సినిమాలను కూడా విజయ్ లైన్లో పెట్టినట్టు సమాచారం.

 

 

డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ తో చేయబోయే ఫైటర్ సినిమా ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా కోసం బాడీ బిల్డ్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత నిన్ను కోరి, మజిలీ వంటి హిట్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడని సమాచారం. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమా తర్వాత మోహన్ కృష్ణ ఇంద్రగంటి సినిమాలో నటించేందుకు కూడా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మోహన్ కృష్ణ చేస్తున్న వి సినిమా పూర్తయ్యాకే విజయ్ సినిమా ఉంటుందని అంటున్నారు.

 

 

ఈ మధ్య విజయ్ దేవరకొండ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలేమీ నమోదు చేయడం లేదు. కానీ విజయ్ క్రేజ్ మాత్రం బాగా ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్ కు కూడా విజయ్ ను నిరాశపరచింది. ఈ సినిమాల్లో ఏ సినిమా అయినా సంచలనం నమోదు చేస్తే విజయ్ దారిలో పడినట్టే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: