గత కొంత కాలంగా జూనియర్ తనకు తానే అజ్ఞాతవాసాన్ని కొనసాగిస్తున్నాడా అంటూ జూనియర్ అభిమానులు అలజడికి గురౌతున్నారు. దీనికి కారణం ఈమధ్య కాలంలో జరిగిన ఏ ఫిలిం ఫంక్షన్ లోను అదేవిధంగా పెద్దపెద్ద పెళ్ళిళ్ళ వేడుకలలోను జూనియర్ ఎక్కడా కనిపించడం లేదు. 

వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ తో జూనియర్ బిజీగా ఉన్నాడు అని భావించినా అదే మూవీలో నటిస్తున్న రామ్ చరణ్ అనేక ఫంక్షన్స్ లో బయట సందడి చేస్తూ కనిపిస్తున్నాడు. దీనితో చరణ్ కు లేని ‘ఆర్ ఆర్ ఆర్’ లో బిజీ జూనియర్ కు మాత్రమే ఎందుకు ఉంది అంటూ తారక్ అభిమానులు మధన పడుతున్నారు. 

క్రితం సంవత్సరం విడుదలైన ‘అరవిందసమేత’ ఫంక్షన్ లో మాత్రమే జూనియర్ తన అభిమానులతో కలిసాడు. ఆ తరువాత తారక్ తన అభిమానులను కలవడానికి కూడ పెద్దగా ఆసక్తి కనపరచలేదు. ఇక మిగతా టాప్ హీరోల విషయానికి వస్తే చిరంజీవి నుండి విజయ్ దేవరకొండ వరకు ఎవరికి వారు ఎదో ఒక సినిమా ఫంక్షన్స్ లో కనిపిస్తూ తమ అభిమానులకు జోష్ ను కలిగిస్తున్నారు. 

అయితే జూనియర్ మాత్రం బయటకు కనిపించక పోవడమే కాకుండా సోషల్ మీడియాలో కూడ మౌనంగా ఉంటూ తన అభిమానులను ఆశ్చర్య పరుస్తున్నాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ మేకర్స్ చేస్తున్న ట్విట్స్ ను మాత్రం జూనియర్ రీ ట్విట్స్ చేస్తూ తన అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు తప్ప అతడి పిల్లలకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను కూడ జూనియర్ షేర్ చేయకపోవడంతో అసలు జూనియర్ కు ఏమైంది అంటూ అభిమానులు అలజడిలో ఉన్నారు. ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి హీరోయిన్ విషయంలో జూనియర్ కు అన్యాయం జరిగింది అంటూ గగ్గోలు పెడుతున్న తారక్ అభిమానులు అతడు కొనసాగిస్తున్న మౌన ముద్రను చూసి తట్టుకోలేకపోతున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: