మెగా మేనల్లుడు తన పేరును సాయి తేజ్ గా మార్చుకున్నా అతడికి నడుస్తున్న కాలం ఏమంత కలిసి వస్తున్నట్లు కానీ పించడం లేదు. అయితే తన జానర్ నుంచి బయటకు వచ్చి దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’  మూవీ పై ఈ మెగా యంగ్ హీరో చాలా ఆశలు పెట్టుకున్నాడు.  

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు విడుదలచేసిన పరిస్థితులలో ఈ మూవీలోని   ‘ఓ బావా’ పాటకు యూత్ బాగానే కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాపై నెమ్మదిగా అంచనాలు పెరుగుతున్నా ఈ మూవీ విడుదల అవుతున్న రిలీజ్ డేట్ ను బట్టి ఈ మూవీ అన్ని విధాలా కార్నర్ అవుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  

‘ప్రతిరోజు పండగే’ సినిమా డిసెంబర్ 20న విడుదల అవుతోంది. అయితే దీనితోపాటు సల్మాన్  ‘దబాంగ్ 3’ బాలకృష్ణ ‘రూలర్’ సినిమాలు కూడ అదేరోజున వస్తున్నాయి.  వాస్తవానికి ఈ రెండు సినిమాలకు సాయి తేజ్ సినిమాకు పోలిక లేకపోయినా రెండు భారీ మాస్ హీరోల సినిమాల మధ్య సాయి తేజ్ ను సగటు ప్రేక్షకులు పట్టించుకుంటారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

బాలయ్య సినిమాలకు బి సి సెంటర్లలో మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అలాగే నగరాలలోని మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులు ‘దబాంగ్ 3’ ని బాగా చూస్తారు. ఇది చాలదు అన్నట్లుగా వెంకటేష్ మూవీ ‘వెంకీ మామ’ డిసెంబర్ 13న కాకుండా 25న రావచ్చు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో అన్ని విధాల సాయి తేజ్ అష్ట దిగ్భందంలో చిక్కుకున్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో మెగా మేనల్లుడుకి జనవరిలో డేట్ దొరకక దొరికిన డిసెంబర్ డేట్ సరిపోక అనేక అవస్థలు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితులలో తేజ్ సాహసంతో తీసుకునే నిర్ణయం ఏమాత్రం మిస్ ఫైర్ అయినా తేజ్ కు కష్టాలు తప్పవు అన్న మాటలు వినిపిస్తున్నాయి..     

 

మరింత సమాచారం తెలుసుకోండి: