కిరాక్ పార్టీ తరువాత యంగ్ హీరో నిఖిల్ నటించిన చిత్రం
అర్జున్ సురవరం. ఎప్పుడో విడుదలకావల్సిన ఈ చిత్రం వాయిదాల మీద వాయిదా పడకుండా వచ్చింది. ఇక ఎట్టకేలకు పెద్దగా బజ్ లేకుండా ఈ రోజు ఈ చిత్రం ప్రేక్షకులముందుకు వచ్చింది. యూఎస్ఏ లో ప్రీమియర్స్ , అలాగే
ఇండియా లో ఎర్లీ మార్నింగ్ షోస్ నుండి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం
సినిమా కు డీసెంట్ టాక్ వస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ , విజువల్స్ సినిమాకు హైలైట్ గా నిలువగా సెకండ్ మాత్రం మైనస్ అయ్యింది.
ఫస్ట్ హాఫ్ ను చాలా బాగా డీల్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో మాత్రం తడబడ్డాడు.సెకండ్ హాఫ్ అంత రిపీటెడ్ గా అనిపించింది అలా కాకుండా ఫస్ట్ హాఫ్ లో లాగా ఇంకాస్త ఆసక్తికరంగా తీర్చిదిద్దింటే సినిమా కు సూపర్ హిట్ టాక్ వచ్చేదే. ఓవరాల్ గా అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వేరే సినిమాలతో పోటీలేకపోవడంతో నిఖిల్ కెరీర్ లో ఈచిత్రం డీసెంట్ హిట్ అనిపించుకోనుంది.
కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'కనితన్'కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటించగా సామ్ సి ఎస్ సంగీతం అందించాడు. ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన టియెన్ సంతోషే ఈ
రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయగా
రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ
సినిమా విడుదలచేసింది. ఫేక్
డిగ్రీ సర్టిఫికేట్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ గా నటించాడు.
ఇక నిఖిల్ ప్రస్తుతం చందూ మొండేటి డైరెక్షన్ లో సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ 'కా
ర్తికేయ' సీక్వెల్ లో నటిస్తున్నాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ ,
వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.