శ్రీరెడ్డి.. ఈ పేరే సంచలనం. పేరు వింటే ముందుగా గుర్తొచ్చేది క్యాంటిగ్ కౌచ్. క్యాస్టింగ్  కౌచ్ పై శ్రీ రెడ్డి చేసిన రచ్చ గురించి చెప్పనవసరం లేదు. కాస్టింగ్ కౌచ్ సమస్య గురించి ఎంత ప్రశ్నించినా ఎవరూ నోరెత్తకపోవటంతో ఏకంగా మా ఆఫీసులో అర్ధనగ్న ప్రదర్శన చేసి దేశవ్యాప్త మీడియా అటెన్షన్ తన వైపు తిప్పుకునేలా చేసింది. 

 

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఫేమస్ అయ్యింది.  తెలుగులో దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, హీరో నాని పై టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచింది.కాంట్రవర్సీలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన శ్రీరెడ్డి తన పేస్ బుక్ పేజ్ అప్పుడప్పుడు వివాదస్పద పోస్టులు పెడతూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ నటి తనకంటే ముందు వివాదాలతో సహవాసం చేసిన రామ్ గోపాల్ వర్మకు ఓపెన్‌గా తనతో డేట్‌కు రమ్మని ఆహ్వానిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

 

ఇక సంచలన దర్శకుడు వర్మ విషయానికి వస్తే  వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని అందరికీ తెలిసిందే. ఈయన తన సినీ జీవితంలో తీసిన చిత్రాలు దాదాపుగా సమస్యలు తెచ్చినవే ఎక్కవగా ఉన్నాయి.  ప్రస్తుతం వర్మ కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాతో ప్రజల ముందకు రానున్నాడు. 

 

అయితే శ్రీరెడ్డి హాట్ హాట్ గా ఓ సంచలన ప్రకటన చేసింది. రామ్ గోపాల్ వర్మని సైతం వదిలిపెట్టేది లేదనుకుందేమో ఎమో కాని తన ఫేస్ బుక్ లో వర్మతో డేటింగ్ చేయాలని ఉందంటూ తెలిపింది.  ఇప్పటి వరకైతే వర్మ దగ్గర నుండి ఎలాంటి స్పందన లేదు. ప్రాక్టికల్ గా ఆలోచించే వర్మ ఈ అమ్మడి  ఆఫర్ కి  ఓకే అంటాడా లేదా నో అంటాడో మరి వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: