టాలీవుడ్ లో గత మూడు నాలుగు నెలలుగా ఒక్క సినిమా కూడా లేకపోవడంతో అటు నిర్మాతలు, బయ్యర్లు, థియేటర్ల యజమానులు తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక గత వారం థియేటర్లలోకి మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాల్లో విడుదలకు ముందే మంచి అంచనాలు రేకెత్తించిన జార్జి రెడ్డి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. జార్జి రెడ్డి ఒక ఇన్స్పైరింగ్ లీడ‌ర్‌గా చూపించకుండా కేవలం కాలేజ్ గొడవల నేపథ్యంలో సినిమాను ప్రజెంట్ చేయడంతో ఫలితం తేడా కొట్టేసింది.



ఇక ముందు నుంచి జార్జిరెడ్డి మంచి ప్రభావం చూపుతుందని అందరూ అనుకున్న నైజాంలో కూడా ఈ సినిమా అంచనాలు అందుకోలేక పోయింది. అయితే మూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన జార్జిరెడ్డికి ఇప్పటికే రెండున్నర కోట్ల షేర్ రావడంతో తక్కువ నష్టాలతో ఈ సినిమా బయటపడుతుందని అనుకోవాలి. గత వారమే విడుదలైన రాగల 24 గంటల్లో చిత్రానికి కనీసం తొలి ఇరవై నాలుగు గంటల్లో కూడా చెప్పుకోతగిన వసూళ్ళు నమోదు కాలేదు. మొదటి వారాంతం గడిచిన తర్వాత పరిస్థితి మరింత దయనీయంగా మారింది.



ఇక గ‌త వార‌మే వ‌చ్చిన తోలు బొమ్మ‌లాట సినిమాకు క‌నీసం పోస్ట‌ర్ల ఖ‌ర్చులు కూడా రాలేద‌ట‌. దీనిని బ‌ట్టి  ఈ సినిమా ఎంత ఘోర‌మైన డిజాస్ట‌రో అర్థం చేసుకోవ‌చ్చు. ఆంగ్ల యానిమేటెడ్‌ చిత్రం ఫ్రోజెన్‌ 2 మల్టీప్లెక్స్‌లలో మంచి వసూళ్లు తెచ్చుకుంటోంది. ఇక న‌వంబ‌ర్లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు ఘోరంగా ప్లాప్ అవ్వ‌డంతో పాటు క‌నీసం థియేట‌ర్ల ఫీడింగ్‌కు కూడా ప‌నికి రాలేదు. అస‌లు న‌వంబ‌ర్‌లో బిజినెస్ డ‌ల్‌గా ఉంటుంద‌న్న‌ది ఇప్ప‌టికే తెలిసినా... చాలా థియేట‌ర్లు వ‌ర్కింగ్ డేస్ లో మూసి ఉంచుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక ఇప్పుడు ఆశ‌ల‌న్నీ డిసెంబ‌ర్‌తో పాటు వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాల‌పైనే ఉన్నాయి. మ‌రి ఈ స్టార్ హీరోల సినిమాలు అయినా ఏం చేస్తాయో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: