తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ప్రియాంక రెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు  వెలుగులోకి వస్తున్నాయి. టోల్ గేట్ వద్ద ప్రియాంకా రెడ్డి వాహనం పెట్టినప్పటి  నిందితులుఆమెను ఫాలో అయ్యారు. ఈ ఘటన సంబందించిన నిందితులైన పాషా అండ్ గ్యాంగ్ ఇటీవలే ఒడిస్సా నుంచి  హైదరాబాద్ కు వచ్చారు. లారీలో లోడ్ నుహైదరాబాద్లో డెలివరీ చేయాల్సి ఉండగా ఇక్కడకు వచ్చారు.

 

ఇక రాత్రి పది గంటల తర్వాత లారీ తీసుకొని హైదరాబాద్ లోపలికి రావాలని యజమాని చెప్పడంతో శంషాబాద్ టోల్ గేట్ వద్ద  వెహికల్ పార్క్  చేసారు. ఇక అప్పటికే పాషా గ్యాంగ్ పీకల్లోతు మద్యంలోమునిగారు. 
అదే సమయంలో ప్రియాంక రెడ్డి టోల్ వద్ద తన వాహనాన్ని పార్క్ చేసి మాదాపూర్ వెళ్ళింది. అది గమనించిన నిందితులు ఆమె కోసం టోల్ ప్లాజా వద్ద వేచి చూసారు. ప్రియాంక వచ్చే లోపు నలుగురు కలిసి వన్ అండ్ ఆఫ్ బాటిల్ మద్యం సేవించారు. అప్పటికే ప్రియాంక రెడ్డి పై లైంగికదాడికి ప్లాన్  భాష అండ్ గ్యాంగ్ చేసుకున్నారు.

 

ప్రియాంక వచ్చేలోపే ఆమె స్కూటీని పాషా పంక్చర్ చేసాడు. ఇక  ప్రియాంక వచ్చే వరకు మద్యం సేవిస్తూ ఉన్నారు నిందితులు. ప్రియాంక రాగానే బండి పంచర్ అయినట్లుగా చెప్పి  వాహనాన్ని పంచర్ చేస్తున్నట్లుగా పదినిమిషాలపాటు డ్రామా లాడారు. బండి పంక్చర్ చేసి తీసుకు వచ్చినట్లుగా నటించారు..వాహనం తీసుకొని బయల్దేరుదామనుకున్న సమయంలో అమ్మాయిని ఎత్తుకెళ్లారు.  

 

పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతం లోపలికి ప్రియాంకను ఎత్తుకెళ్లి నలుగురు కలిసి ప్రియాంక రెడ్డి ని గ్యాంగ్ రేప్ చేశారు.  నోరు మూసి వేసి గాలి ఆడకుండా చేసి ప్రియాంక రెడ్డి ని చంపేశారు. మృతదేహాన్ని అక్కడే వదిలి పెడితే తాము పట్టుబడతామని భావించిన గ్యాంగ్..  డెడ్ బాడీని అదృశ్యం చేసేందుకు ప్లాన్ వేశారు.  ప్రియాంక రెడ్డి మృతదేహాన్ని దుప్పట్లో చుట్టీ లారీలో తరలించారు. 

 

పెట్రోల్ కొనుగోలు చేసి, చెటాన్ పల్లి బ్రిడ్జి కింద మృతదేహాన్ని కింద పడవేసి కాల్చివేశారు. రేప్ అండ్ మర్డర్ చేసిన‌ తరువాత ఇళ్ళలోకి ఏమీ తెలియనట్టు ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే తమకూతురు కనిపించడం లేదని  కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా రాత్రి 11 గంటల సమయంలో ఆ పరిధి తమది కాదంటే తమది కాదంటూ పోలీసులు చేతులెత్తేయంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఘటన జరిగిన తర్వాత పోలీసులు పెట్టిన ఫోకస్.. అప్పుడే పెట్టిఉంటే.. కనీసం తమ కూతురు ప్రాణాలతో ఉండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.

మరింత సమాచారం తెలుసుకోండి: