బాలీవుడ్‌ హీరో, కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ తాజా చిత్రం దబాంగ్‌-3 తియ్యనున్నారని అందరికి తెలిసిన  విషయమే కానీ ఇప్పుడు ఈ  చిత్రానికి  కొత్తగా  చిక్కులు వచ్చి పడ్డాయి.   సోషల్‌ మీడియాలో దబాంగ్‌ 3 చిత్ర యూనిట్‌  ఇటీవల  సాంగ్‌ ప్రోమోను రిలీజ్‌ చేశారు ,ఈ శుక్రవారం ఆ సాంగ్ ప్రోమోలో హిందూ దేవతలు, సాధువులను కించపరిచారంటూ పెద్ద ఎత్తున #బాయ్‌కాట్‌దబాంగ్‌3 అనే దుమారం భారీగా  చెలరేగింది. ఈ చిత్రంలో  కొన్నిసీన్లు అభ్యంతకరంగా ఉన్నాయని, సల్మాన్‌  ఈ చిత్రంలో హిందువుల మనోభావాలను   దెబ్బతీశారంటూ జనజాగృతి అనే హిందూ ధార్మిక సంస్థ దబాంగ్‌3 చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేయాలని పిలుపునిచ్చింది.

 

ఇక అస్సలు విషయానికొస్తే ..  'మై హు దబాంగ్‌ దబాంగ్‌' అనే సాంగ్‌లో హీరో సల్మాన్‌ ఖాన్  వెనుకగా కొంతమంది సాధువులు గిటార్‌ పట్టుకుని తమ కాళ్లను కదిపే సీన్లు ఉన్నాయి. దీంతో సల్మాన్‌ హిందువుల వ్యతిరేకి అని తెలియజేసే విధంగా వుంది , డిసెంబరు 20న ఈ చిత్రాన్ని  ప్రపంచవ్యాప్తంగా  విడుదల కానున్న దబాంగ్‌3ను అడ్డుకోవాలని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

 

దీనిపై  సల్మాన్‌ ఖాన్ అభిమానులు  స్పందిస్తూ ఎవరు ఎన్ని ఎత్తులేసినా ఈ  చిత్రాన్ని ఆపడానికి ట్రై చేసిన  లాభం లేదు .. దబాంగ్‌3 మాత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొడుతుందని  ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాక సల్మాన్‌ అభిమానులు   హీరో అక్షయ్‌కుమార్‌ ఇదివరకు 'భూల్‌ భులయ్యా' సాంగ్‌లో సాధువులను వెంటేసుకుని డాన్స్‌ చేస్తే రాని నిరసనల హోరు.. ఇప్పుడెందుకొస్తుందని వెనకేసుకొస్తున్నారు.

 

కేవలం ముస్లిం కావడంతోనే ఇలా రచ్చ రచ్చ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సల్మాన్‌  ఖాన్  పేరుకి ముస్లిం ఐనా  ఆయన అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాడని, ఆయన పై  అంతా ద్వేషం పనికిరాదని కొందరు కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు మాత్రం సినిమాను బాయ్‌కాట్‌ చేయకుండా కేవలం 10 సెకన్ల నిడివిగల సాధువులు ఉన్న సీన్‌ కట్‌చేస్తే సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: