పూరీ జగన్నాథ్ ఛార్మీల సాన్నిహిత్యం పై అనేక గాసిప్పులు హల్ చల్ చేసాయి. అయితే ఛార్మీ పూరీలు మాత్రం తాము మంచి స్నేహితులు మాత్రమే అంటూ అనేకసార్లు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఛార్మీ టాలీవుడ్ ఏక్తా కపూర్ గా పరిగణింపబడుతు మహిళా నిర్మాతగా మాత్రమే కాకుండా ముంబాయి నుండి అనేకమంది మోడల్స్ ను హీరోయిన్స్ గా మార్చి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఈ డీల్స్ లో బాగా లాభ పడుతోంది అన్న ప్రచారం జరుగుతోంది.

‘ఇస్మార్ట్ శంకర్’ తో తిరిగి పూరీ దర్శకుడుగా  బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఛార్మీ సహకారం పూరీకి చాల ఉపయోగ పడింది అన్నది ఓపెన్ సీక్రెట్. ఇది ఇలా ఉండగా ఛార్మీ ఒక యువకుడు పై మనసు పారేసుకుని ఆ యువకుదుని ఇప్పుడు ప్రమోట్ చేయడం చాల మందిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 


కెరీర్ ప్రారంభం నుండి ఛార్మికి డాన్సర్ గా మంచి గుర్తింపు ఉంది. టాప్ హీరోలు అందరితోను నటించిన ఛార్మీ పాటలకు వేసే స్టెప్స్ కు ఆమెను అభిమానించే వారు చాలామంది ఉన్నారు. అయితే అటువంటి ఛార్మీ మనసును ఇప్పుడు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఒక యువకుడు దోచుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఛార్మీ తన ట్విటర్ ద్వారా అందరికీ షేర్ చేస్తూ షాక్ ఇచ్చింది. ఈమె నిర్మాణంలో నిర్మాణంలో లేటెస్ట్ గా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ లోని  'సిలక.. సిలక..' అంటూ సాగే ఒక మాస్‌ పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలుసు. 


అయితే ఇప్పుడు ఆ పాటకు శ్రీకాంత్‌ అనే కుర్రాడు డ్యాన్స్‌ చేసిన వీడియోను అతడి స్నేహితుడు తన ట్విటర్‌ ద్వారా అందరికీ షేర్ చేస్తూ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఛార్మిలను ట్యాగ్‌ చేశాడు. ఇప్పుడు ఈ వీడియోను చూసిన ఛార్మి అతని డ్యాన్స్‌కు ఫిదా అయిపోయి శ్రీకాంత్‌ స్నేహితుడు పెట్టిన పోస్ట్‌ను రీట్వీట్‌ చేస్తూ తన అభిమానులకు షేర్ చేయడమే కాకుండా ఆ కుర్రాడి పై ప్రశంసలు కురిపించింది. దీనితో రానున్న రోజులలో పూరీతో చెప్పి ఈ యువకుడుకి ఛార్మీ అవకాశాలు ఇప్పించినా ఆశ్చర్యం లేదు అంటూ కొందరు జోక్స్ వేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: