మాస్ మహా రాజా రవితేజ ,ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్ వి ఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'డిస్కోరాజా'. ఈ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఈ సినిమా టీజర్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ చిత్రం యొక్క టీజర్ డిసెంబర్ 6న విడుదలకానుందని సమాచారం. త్వరలోనే ఈ టీజర్ గురించి అధికారిక ప్రకటన వెలుబడనుంది. సైన్టిఫిక్
థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాభా నటేష్ , పాయల్
రాజ్ పుత్ , తాన్యా హాప్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఫై రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ కోలీవుడ్ హీరో బాబీ సింహ విలన్ పాత్రలో నటిస్తుండగా సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.
ఈచిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదలచెయ్యాలనుకున్నారు కానీ అప్పటివరకు గ్రాఫిక్స్ పనులు పూర్తికాకపోతుండడంతో వాయిదావేశారు. ఫిలిం నగర్ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం జనవరి 25 న ఈచిత్రాన్ని విడుదలచేయనున్నారని తెలుస్తుంది. ఇక గత ఏడాది టచ్ చేసి చూడు , నేల టిక్కెట్టు ,
అమర్ అక్బర్ ఆంటొని రూపంలో మూడు భారీ డిజాస్టర్లను చవిచూసిన రవితేజకు డిస్కోరాజా విజయం కీలకం కానుంది.
ఈచిత్రం తోపాటు రవితేజ , గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో క్రాక్ లో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం యొక్క షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం
రవితేజ ఈ
సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రం లో ఆయన పవర్ ఫుల్
పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.
శృతి హాసన్ ఈ చిత్రంలో
హీరోయిన్ గా నటిస్తుండగా
తమన్ సంగీతం అందిస్తున్నాడు.