రాశీ ఖన్నాఊహలు గుస గుసలాడే చిత్రంతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. మంచి అందం, శరీరంతో తెలుగు కుర్రాళ్ల మనసులని కొల్లగొట్టింది. బెంగాల్ టైగర్ లో బికినీ వేసి అందరికి నిద్ర లేకుండా చేసిన అందం రాశీ ఖన్నా. ప్రస్తుతం రాశీ ఖన్నా సాయి తేజ్ సరసన `ప్రతి రోజు పండగే` చిత్రంలో నటిస్తోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్నాఈ చిత్రానికి మైత్రి మూవీస్ నిర్మాత .

 

ఈ సినిమాలో టిక్ టాక్ కి బానిస అయిన బ్యూటీగా రాశీ  కడుపుబ్బా నవ్విస్తుంది అని ప్రచారం జరుగుతుంది. కథానాయకుడి మరదలి పిల్లగా అదిరిపోయే రొమాన్స్ చేయబోతోందని ఇటీవలే రిలీజైన టీజర్.. సాంగ్ తెలియచేస్తున్నాయి. ఇక రాశీ పాత్రను మారుతి చాలా జాగ్రత్త తీసుకుని ప్రత్యేకంగా తీర్చిదిద్దారన్న టాక్ వినిపిస్తోంది.

 

Image

 

పచ్చని పల్లెటూరి నేపథ్యంలో సినిమా ఆద్యంతం పండగలానే సాగే ఈ చిత్రంలో అక్క బావా అంటూ ఓ లేడీ గ్యాంగ్ అలరించనుందని ఇంతకు ముందు రిలీజ్ చేసిన సాంగ్ టీజర్ తెలియచేసింది. ఇక పోతే రాశీ ఖన్నా వెకేషన్ కి సంబంధించిన ఓ ఫోటో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది . అది కూడా తన ముంబై స్నేహితురాలు, బాలీవుడ్ హాట్ యాక్టర్ వాణీ కపూర్ తో కలిసి వెకేషన్ కి వెళ్లిన ఫోటో. వాణీతో ఎంతో సన్నిహితంగా ఉంది రాశీ. తనతో ఉన్న సాన్నిహిత్యం చూస్తుంటే బాలీవుడ్ మూవీస్ కి రికమండ్ చేస్తోందా? అన్న సందేహం రాకుండాపోదు. 

 

 

ఈ రోజు రాశీ ఖన్నా బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా మామూలుగా చేయడం లేదు. సాయి తేజ్ అభిమానులు సైతం రాశీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ ప్రతి రోజూ పండగే ఫోటోల్ని వీడియోల్ని షేర్ చేస్తున్నారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతిరోజు పండగే టీమ్ కి రాశీ ధన్యవాదాలు తెలిపింది.పింక్ డ్రెస్ లో చాల అద్భుతంగా ఉంది  రాశీ ఖన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి: