హిట్ అన్న పదం విని రవితేజాకు కొన్ని సంవత్సరాలు అవుతోంది. వరస పరాజయాలతో తన క్రేజ్ ను కోల్పోయిన రవితేజ తన ‘డిస్కో రాజా’ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తి అయిన తరువాత జనవరి చివరి వారంలో ఈ మూవీని విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

అయితే ఈ సినిమాకు ప్రమోషన్ చాల విభిన్నంగా ఉండబోతోంది. ఒక సినిమా ప్రమోషన్ సంబంధించి ఒకటి లేదంటే రెండు టీజర్లు విడుదల చేస్తారు. అయితే ‘డిస్కో రాజా’ కోసం ఏకంగా నాలుగు టీజర్లు రెడీ పెట్టినట్లు సమాచారం. విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో రవితేజ రెండు పాత్రలు పోషించాడు. 

ఇందులో ఒక పాత్ర కోమాలోకి వెళ్లి మళ్లీ వస్తుంది. దాంతో వయస్సు పెరిగినా లుక్ అలాగే యంగ్ గా వుంటుంది. సైన్స్ ఫిక్షన్ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ స్క్రీన్ ప్లే చాల డిఫరెంట్ గా ఉంటుందని టాక్.  ఈమూవీలో రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలో కనిపించబోతున్నాడు. ర‌వితేజ శైలికి భిన్నంగా ఉండే ఈ పాత్ర నేటితరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది అంటున్నారు. 


ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఫ‌స్ట్ సింగిల్‌ తో ‘డిస్కో రాజా’ మంచి ఇంప్రెష‌న్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మొదటి టీజర్ ను ఈ నెల 6వ తారీఖున విడుదల చేయబోతున్నారు. ‘డాడీ.. బ్యాడీ ఆన్ ద వే’ అంటూ ఈ టీజ‌ర్ గురించి ఇంట్రో ఇచ్చారు. దీనినిబ‌ట్టి చూస్తే ఈ సినిమాలో ర‌వితేజ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ ను చేస్తున్నాడ‌న్న‌ది స్ప‌ష్టం. పున‌ర్జ‌న్మ నేప‌థ్యంలో సాగే రివెంజ్ డ్రామా కథ ఇది అంటున్నారు. ఇలాంటి కథలు ఇప్పటికే చాల వచ్చినా స్క్రీన్ ప్లే అని ట్రీట్మెంట్ కొత్త‌గా ఉంటుంద‌ని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ పక్కన హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న నేపధ్యంలో ఈమె గ్లామర్ ఈ సినిమాకు మరొక అదనపు ఆకర్షణ కాబోతోంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: