కన్నడ సినిమాల్లో నటించి టాలీవుడ్ కి షిఫ్ట్ అయిన అందాల భామ రష్మిక మందన. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ లీడ్ లో ఉన్న రష్మిక ఈ స్టార్ స్టేటస్ ను ఊహించైనా ఉండదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే రష్మిక రీసెంట్ గా ఓ పోస్టు పెట్టింది. ఈ సందర్భంగా తన వాల్ లో ‘ఈ పిక్ లో కోతి ఒకటే మిస్ అయింది’ అని రాసుకుంది. స్టైలిస్ట్, మేకప్, ఔట్ ఫిట్.. అంటూ తన పర్సనల్ స్టాఫ్ గురించి కూడా తెలిపింది. ఇక్కడ సందేహం ఏంటంటే ఇంతకీ ఆ కోతి ఎవరు అనే!
ఇటివల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివ్ లో పాల్గొన్న ఫొటోను షేర్ చేసింది. ఈ పిక్ లో లైట్ రోజ్ కలర్ గౌన్ లో రష్మిక మెరిసిపోతోంది. ఈ పిక్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. లక్షల్లో లైక్స్ కామెంట్స్ వచ్చాయి. ‘నేనే ఆ కోతిని’, ‘ఎంత అందంగా ఉన్నావో’, ‘మై లవ్’.. అంటూ కామెంట్లు చేశారు. ఇంతకీ ఆ కోతి తన సినిమా హీరోల గురించా మరెవరి గురించి అనేది సస్పెన్స్ లో పెట్టేసింది ఈ లిల్లీ.
తొలి సినిమాగా చేసిన ఛలో సూపర్ హిట్ అవడంతో దర్శక నిర్మాత దృష్టిలో పడింది. ఆ తర్వాత నలుగురు హీరోయిన్లు కాదన్న టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ గీత గోవిందంతో స్టార్ హీరోయిన్ అయిపోయంది. మధ్యలో చేసిన దేవదాస్ ఏవరేజ్ అయినా.. ఎన్నో అంచనాలు క్రియేట్ చేసి చతికిలపడిన డియర్ కామ్రేడ్ ఆమె క్రేజ్ కు అడ్డు రాలేదు. ఏకంగా సూపర్ స్టార్ మహేశ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నితిన్ సినిమాల్లో అవకాశాలు పట్టేసింది. వచ్చే సంక్రాంతికి మహేశ్ సరిలేరు నీకెవ్వరుతో రానుంది.