నిత్యం మనం తీసుకునే పలు రకాల ఆహార పదార్థాల వల్ల మనకు వివిధ రకాల పోషకాలు, శక్తి లభిస్తాయి. రోజూ వ్యక్తులు తీసుకునే ఆహారం వారి వారి ఆర్థిక స్థోమత, స్థాయిని బట్టి ఉంటుంది. అయితే ఎలాంటి ఆహారం తీసుకున్నా దాని ప్రభావం శృంగారంపై కూడా పడుతుంది. కొన్ని ఆహార పదార్థాలను తింటే శృంగారంలో ఎలా చురుగ్గా పాల్గొనగలుగుతారో, కొన్నింటి వల్ల ఆ కార్యక్రమంలో నీరసం చెందుతారు. ఈ క్రమంలో శృంగారంలో పాల్గొనబోయే దంపతులు ఏయే ఆహార పదార్థాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పొగ తాగడం, మద్యం సేవించ‌డం
శృంగారంలో పాల్గొంటానికి ముందు మద్యం సేవించరాదు, పొగ తాగ‌కూడ‌దు. ఇవి ఆ కార్యక్రమంపై అధిక ప్రభావాన్ని చూపుతాయి. శృంగారాన్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేరు. మానసికంగా, శారీరకంగా అలసిపోయి ఉంటారు, కనుక మద్యం సేవించినప్పుడు, పొగ తాగిన‌ప్పుడు శృంగారంలో పాల్గొనకూడదు. అది తృప్తినివ్వదు.

 

2. బీన్స్

ఇవి చాలా సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్స్ జాబితాకు చెందుతాయి. దీంతో ఇవి జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. అలాంటి సమయంలో జీర్ణాశయం బాగా పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు శృంగారంలో పాల్గొంటే జీర్ణాశయం పనితనం తగ్గి అందులో గ్యాస్ పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అలా జరిగితే కడుపులో తిమ్మిరి మొదలవుతుంది. నొప్పి కూడా రావచ్చు. కనుక శృంగారంలో పాల్గొనేవారు బీన్స్ తినకూడదు.

 

3. క్యాబేజీ

బీన్స్ మాత్రమే కాదు, క్యాబేజీ కూడా అదే రకమైన సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్లను కలిగి ఉంటుంది. జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. కనుక శృంగారంలో పాల్గొనేవారు దీన్ని కూడా తినకూడదు.

 

4. ఉల్లిపాయ

ఉల్లిపాయ శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. అయితే దీన్ని శృంగారంలో పాల్గొంటానికి ముందు మాత్రం తినకూడదు. ఎందుకంటే ఆ సమయంలో సహజంగానే చెమట ఎక్కువ పడుతుంది కనుక ఉల్లిపాయలను తిని ఉంటే ఆ చెమట ఎక్కువ దుర్వాసన వస్తుంది. అది మీ భాగస్వామికి అంతగా నచ్చకపోవచ్చు. దీంతో కార్యక్రమం మొత్తం బెడిసికొట్టే అవకాశం ఉంటుంది.

5. సోయా

సోయా గింజలు లేదా దాంతో చేసే ఆహార పదార్థాలను శృంగారానికి ముందు తినరాదు. తింటే పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గుతుంది. టెస్టోస్టిరాన్ ఉత్పత్తి కాకుండా చూస్తుంది. కాబట్టి ఈ ఆహారాన్ని తినకపోవడమే మంచిది.

6. కేకులు

కేకులు, మఫిన్లు, పాస్ట్రీలు తదితర తీపి పదార్థాలను కూడా శృంగారానికి ముందు తినరాదు. తింటే వాటిల్లో ఉండే చక్కెర స్త్రీ, పురుషులిద్దరిలోనూ శృంగార సామర్థ్యాన్ని నశింపజేస్తుంది. కాబట్టి ఈ ఆహారాన్ని తినకపోవడం ఉత్తమం.

7. ప్రాసెస్ చేసిన మాంసం

సూపర్ మార్కెట్లలో ప్యాకెట్లలో దొరికే ప్రాసెస్ చేసిన మాంసాన్ని శృంగారానికి ముందు తినరాదు. ఇది టెస్టోస్టిరాన్ స్థాయిలను, లిబిడోను తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: