సినిమా ఇండస్ట్రీ మొత్తం సెంటిమెంట్స్ పై నడుస్తుంది. అలాంటి ఆ పరిస్థితులలో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి ఇప్పుడు విజయశాంతి నెగిటివ్ సెంటిమెంట్ ఒకటి వెంటాడుతు ఉండటం హాట్ న్యూస్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో కీలక పాత్రను పోషిస్తున్న విజయశాంతి తన పాత్రకు తన సొంత గొంతుతో డబ్బింగ్ చెపుతున్నట్లు తెలుస్తోంది. 

నిజానికి విజయశాంతి టాప్ హీరోయిన్ స్థాయిలో ఒక వెలుగు వెలిగిన రోజులలో ఆమెకు ఒకనాటి హీరోయిన్ సరిత డబ్బింగ్ చెపుతూ వచ్చేది. విజయశాంతి ఎమోషనల్ నటనకు సరిపోయే స్థాయిలో సరిత బాగా డబ్బింగ్ చెపుతూ ఉండటంతో అప్పట్లో విజయశాంతి టాప్ హిట్స్ అన్నింటికి సరిత వాయిస్ తోనే డబ్బింగ్ జరిగింది. 

విజయశాంతి కెరియర్ నెమ్మదినెమ్మదిగా క్షీణిస్తున్న సమయంలో ఆమె నటించిన అప్పటి సినిమాలకు విజయశాంతి సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం ప్రారంభించి సరితను పక్కకు తప్పించింది. అయితే విజయశాంతి తన సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకున్న సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈ సెంటిమెంట్ గుర్తుకు వచ్చి అనీల్ రావిపూడి విజయశాంతి పాత్రకు వేరే వారిచేత డబ్బింగ్ చెప్పించాలని ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలను విజయశాంతి తిరస్కరించి తన వాయిస్ తోనే డబ్బింగ్ చెపుతాను అని క్లారిటీ ఇచ్చినట్లు టాక్. 

ఇప్పటికే ఈ సినిమాలో ఒక అతిథి పాత్రలో మహేష్ పక్కన తమన్నా నటిస్తోంది. గతంలో తమన్నా మహేష్ తో నటించిన ‘ఆగడు’ ఘోరమైన ఫ్లాప్ దీనితో మహేష్ కు తమన్నా నెగిటివ్ సెంటిమెంట్ తో పాటు విజయశాంతి వాయస్ నెగిటివ్ సెంటిమెంట్ కూడ వచ్చి చేరడంతో పైకి చెప్పకపోయినా ఈ రెండు నెగిటివ్ సెంటిమెంట్స్ మహేష్ ను భయపెడతాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై అనేక నెగిటివ్ ప్రచారాలు జరుగుతున్న నేపధ్యంలో తెర పైకి వచ్చిన ఈ నెగిటివ్ సెంటిమెంట్స్ ను చూసి  ఈ మూవీ బయ్యర్లు భయపడిపోతున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: