కొడుకు పుట్టినప్పుడు కాదు కొడుకు ఎదిగినప్పుడు తండ్రికి అసలైన ఆనందం అని చెప్తారు పెద్దలు. మన తెలుగు హీరో సందీప్ కిషన్ తండ్రి కూడా ఇప్పుడు ఇదే అనుభవిస్తున్నారు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన సందీప్ కిషన్. కొన్ని, రోజుల్లోనే హీరోగా ఎదిగారు కెరియర్లో పెద్దగా హిట్లు లేకపోయినా మంచి కథలు ఎంపిక చేసుకుంటారు అని పేరు ఉంది. 

 

కెరీర్ మొదట్లో రకుల్ ప్రీత్ సింగ్ తో నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎంతో పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. కానీ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ప్రయత్నించినా అన్నీ కూడా విఫలమవుతూ వచ్చాయి. చివరికి వెబ్ సిరీస్లో కూడా నటించారు సందీప్ కిషన్. తాజాగా, జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ అనే చిత్రంతో మన అందరి ముందరికి వచ్చాడు. ఈ చిత్రం కూడా అనుకున్న విజయం సాధించలేదనే చెప్పాలి. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హన్సిక నటించింది.

 

 అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు సందీప్ కిషన్ తన  తల్లి తండ్రులకు ఓ కానుక అందజేశాడు. బెంజ్ కార్ ని తన తల్లిదండ్రులకు కానుకగా అందజేశాడు. సందీప్ ఈ విధంగా వారి పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. సందీప్ తన జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యాన్ని వారిద్దరూ నాకు ఇచ్చారని చేసి చెప్పాడు. ‘నన్ను, నా ఎంపికలను ఎంతో ఓపికగా భరించినందుకు అమ్మ, నాన్నకు ధన్యవాదాలు.  

 

నా వృతిల్లో ఉన్న ఒడిదుడుకులను అర్థం చేసుకోవడం ఎంతో కష్టమో నాకు తెలుసు. ఈ కానుకను మీకు అందజేయడానికి చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాను.. లవ్‌ యూ. డాడీ మీరు ఎంతో జాగ్రత్తగా కారు డ్రైవ్‌ చేయడం ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం సందీప్ కిషన్ ఏ1 ఎక్సప్రెస్ చిత్రంలో నటిస్తున్నాడు ఈ సినిమా కథ అంతా హాకీ కి సంబంధించిన చిత్రంగా ఉంటుందని చెప్పారు.ఈ చిత్రానికి డెన్నిస్‌ జీవన్‌ కనుకొల దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: