మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘సరిలేరు నీకెవ్వరు’ మొదటి పాట నిన్న విడుదలైన కొన్ని క్షణాలలోనే వైరల్ గా మారింది. ఈ పాటకు మహేష్ అభిమానులు జోష్ లోకి వెళ్ళి పోతుంటే ఈ పాటను టార్గెట్ చేస్తూ అప్పుడే నెగిటివ్ కామెంట్స్ మొదలై పోయాయి. 'మైండ్ బ్లాంక్..మైండ్ బ్లాంక్' అంటూ సాగిన ఈ మాస్ బీట్ సాంగ్ లో ప్రత్యేక ఏముంది అంటూ బన్నీ అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు.

‘అల వైకుంఠపురములో’ ని ‘సామజవరగమన’ కు ఏ స్థాయిలోను ఈ పాట సరితూగదని కేవలం దేవిశ్రీ ప్రసాద్ నుండి వచ్చిన ఒక రొటీన్ మాస్ బీట్ సాంగ్ మాత్రమే అంటూ బన్నీ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఈ పాటకు సంబంధించి అక్కడక్కడ మహేష్ డైలాగ్స్ తో తన గొంతు కలపడం తప్ప మరి ఏమి ప్రత్యేకత ఉంది అంటూ బన్నీ అభిమానుల సూటి ప్రశ్నలు ఈ పాట పై అప్పుడే మొదలై పోయాయి. 

ముఖ్యంగా ‘నువ్వు కొట్టరా..నువ్వు ఊదరా,,నువ్వు వాయించరా’ అంటూ ఫన్నీగా మహేష్ డైలాగులు తప్ప ఈ పాట సాహిత్యంలో కాని ట్యూనింగ్ లో కాని ప్రత్యేకత కనిపించడం లేదు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. ‘సామజవరగమన’ లాంటి మ్యానియా సృష్టించిన పాటకు పోటీగా విడుదల అయిన ‘సరిలేరు నీకెవ్వరు’  మొదటి పాటలో దేవిశ్రీ ప్రసాద్ కేవలం తన మాస్ బీట్ ను మాస్ సాహిత్యాన్ని మాత్రమే నమ్ముకుని ఇది ఒక మాస్ మూవీ అన్న సంకేతాలు ఇచ్చినట్లు అర్ధం అవుతోంది. 

వాస్తవానికి ఈ మూవీ దర్శకుడు అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ పూర్తి మాస్ మూవీ అన్న సంకేతాలు ఇస్తూనే ఉన్నాడు. దీనితో నిన్న విడుదలైన ‘మైండ్ బ్లాంక్’ పాట కూడ అదే సంకేతాలను ఇస్తోంది. అయితే ఒక సినిమా రికార్డులు క్రియేట్ చేయాలి అంటే మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు కూడ పూర్తిగా ఆ మూవీని పూర్తిగా ఆదరించాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: