ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోలే జిం కెళ్ళి కసరత్తులు చేసి కండలు పెంచేవారు. కానీ ఫిట్‌నెస్ అంటు హీరోయిన్స్ కూడా మొదలెట్టారు. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ జిం లో వ్యాయామం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్..ఇలా అన్నీ ఇండస్ట్రీస్ కి సంబంధించిన హీరోయిన్స్ అందరు కత్తిలాంటి ఫిజిక్ మేయిన్‌టైన్ చేయడానికి రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితె ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ పోస్ట్ చేసిన ఒక జిం ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వాస్తవంగా ఇక్కడ ఉంది ఒక్కరు కాదు ఇద్దరు. ఆ ఇద్దరూ విదేశీ ముద్దుగుమ్మలే అయినా లోకల్ గాళ్స్ కి పోటీనిస్తూ ముంబై పరిశ్రమలో ఎవరి దారిలో వాళ్లు సత్తా చాటారు. సెలబ్రిటీ ప్రపంచంలో నిరంతరం తమను తాము గెలిపించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇక ఇందులో ఒకరు స్టార్ హీరోయిన్ కత్రిన కైఫ్ అయితే.. ఇంకొకరు యాంకర్ కం మోడల్ కం నటి సోఫియా హయత్.

 

ప్రస్తుతం ఆ ఇద్దరూ కలిసి ఏం చేస్తున్నారో ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ హాట్ గాళ్స్ రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్స్. కుర్రభామలకు పోటీగా టోన్డ్ బాడీని బిల్డప్ చేయడంలో వీళ్ల తర్వాతనే ఎవరైనా అనే రేంజ్ లో తమ బాడీని మేయిన్‌టైన్ చేస్తున్నారు. దానికోసం ఎంతగా శ్రమిస్తారో ఇదిగో ఈ లుక్ చూస్తే అర్థమవుతోంది. WWE కాంపిటీషన్స్ కి పంపిస్తే ఖచ్చితంగా ఈ ఇద్దరూ కప్ గెలుచుకు రావడం గ్యారెంటీ అని చెప్పాలి. అంతగా తమ ఫిట్ బాడీనీ చూస్తే తెలుస్తుంది. 

 

సోఫియా పర్ఫెక్ట్ ఫిజిక్.. మెలితిరిగిన కండలు చూస్తుంటే జిమ్ లో ఎంతగా శ్రమిస్తోందో ఈ లుక్  చూస్తుంటే ఎవరికైనా అర్థం కాకపోవడానికి పెద్ద సమయం పట్టదు. అలాగే కత్రిన ఎంతగా శ్రమిస్తుందో ఆవిష్కరించే జిమ్మింగ్ ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలోలో ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఇదంతా ఓ ఫిట్ నెస్ కార్యక్రమం కోసం సోఫియా చేస్తున్న ప్రమోషన్ అట. కత్రిన రీబాక్ కి ప్రచారం చేస్తుంటే సోఫియా రీడ్ అనే స్పోర్ట్ డ్రెస్ కంపెనీకి ప్రచారం చేస్తున్నారు. ఇక కత్రినా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి సూర్యవంసి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు సత్తె పె సత్తా సినిమాలో కూడా నటిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా సమాచారం. ఈ రెండు సినిమాలు 2020 లో రిలీజ్ అవబోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: