విజయ్ దేవరకొండ మ్యానియా బాలీవుడ్ హీరోయిన్స్ ను ఎలా ఆకర్షింప చేస్తోందో తెలియ చెప్పే ఒక ఆసక్తికర సంఘటన ఈ మధ్య జరిగింది. ఇప్పటికే జాన్వీ దక్షిణాది హీరోలతో నటిస్తే విజయ్ దేవరకొండ తోనే నటిస్తాను అంటూ ఓపెన్ గానే చెప్పింది. ఇప్పుడు ఈ లిస్ట్ లో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియా భట్ చేరిపోవడం మరింత ఆశ్చర్యంగా మారింది. 

తెలుగు హీరోలలో విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ హెయిర్ స్టైల్ అదేవిధంగా అతడి లుక్స్ చాల డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈ ప్రత్యేకతల వలనే విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలో యూత్ కు బాగా దగ్గర అయిపోయాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు యూత్ తో పాటు విజయ్ మ్యానియాకు బాలీవుడ్ బ్యూటీలు కూడ పడిపోతున్నారు. 

తాను మనసులో అనుకున్నది ఎటువంటి మొహమాటం లేకండా బయటకు చెప్పే అలియా భట్ విజయ్ దేవరకొండ గురించి ఈమధ్య జరిగిన ఫిలిం ఫెయిర్ ‘గ్లామర్ అండ్ స్టైల్’ అవార్డ్స్ కార్యక్రమంలో కొన్ని ఆశ్చర్యమైన కామెంట్స్ చేసింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న అలియా భట్ ను ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ సంవత్సరపు ఫ్యాషనబుల్ స్టార్ ఎవరు అంటూ ఆ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న సెలెబ్రెటీ అడిగాడు. 

ఈ ప్రశ్నకు అలియా భట్ ఒక్క క్షణం కూడ ఆలోచించకుండా తన దృష్టిలో హీరోయిన్స్ లో ఫ్యాషన్ బుల్ స్టార్ అనుష్క శర్మ అని చెప్పి హీరోల విషయం వచ్చేసరికీ ఒక్క క్షణం ఆలోచించి విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. దీనితో ఈ ఈవెంట్ ను కవర్ చేయడానికి వచ్చిన బాలీవుడ్ మీడియా ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అలియా భట్ ప్రస్తుతం చరణ్ తో ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటిస్తోంది. అయితే అలియా భట్ మనసు మాత్రం విజయ్ దేవరకొండ పై మళ్లడం చూస్తుంటే రానున్న రోజులలో వీరిద్దరు కలిసి ఒక మూవీలో నటించే అవకాశం దగ్గరలోనే ఉంది అనుకోవాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: