రామ్ చరణ్ కెరియర్ కోసం చిరంజీవి అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాడు. చరణ్ నటించే సినిమాల కథలను వినడం దగ్గర నుంచి దర్శకుల ఎంపిక వరకు చిరంజీవి సలహాలు చరణ్ పై ప్రభావితాన్ని చూపెడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి ఈమధ్య చరణ్ కోసం మూడు మార్గాలు అన్వేషించినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉంటున్న నేపధ్యంలో చరణ్ తన తదుపరి సినిమా గురించి ప్లాన్ చేసుకోవడం లేదు. అయితే ఈమధ్య చిరంజీవి చరణ్ కు ఒక క్లాస్ పీకినట్లు సమాచారం. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ షూటింగ్ లో ఉండగానే వచ్చే ఏడాది చివరిలో ప్రారంభించే మరొక సినిమా గురించి ఆలోచన చేయకపోతే ‘ఆర్ ఆర్ ఆర్’ వల్ల వచ్చే క్రేజ్ అంత వృధా అయిపోతుందని అందువల్ల చరణ్ ను తన తదుపరి సినిమాల కథలు వినే కార్యక్రమాన్ని ఇప్పటి నుంచే ప్రారంభించ వలసిందిగా ఒక సూచన చేసినట్లు టాక్. 

అంతేకాదు ప్రస్తుతం చరణ్ తో సినిమా చేయాలి అని ఉబలాట పడుతున్న దర్శకులు సందీప్ వంగా అనీల్ రావిపూడిలు చెప్పే కథలు వినమని చిరంజీవి చరణ్ కు సూచించినట్లు తెలుస్తోంది. వీరిద్దరితో పాటు తమిళ మళయాళ ఇండస్ట్రీకి చెందిన కొందరు యంగ్ డైరెక్టర్స్ పై కూడ దృష్టి పెట్టమని చిరంజీవి చరణ్ కు మరొక మార్గం సూచించినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం ఒక సినిమాకు సంబంధించిన కథ ఒకే అయిన తరువాత ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులకు కనీసం ఏడాది కాలం పడుతున్న ప్రస్థితులలో కథ గురించి నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పటికి పూర్తి అవుతాయి అంటూ చిరంజీవి చరణ్ కు స్పష్టమైన సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే చరణ్ మాత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తి అయిన తరువాత కొంత గ్యాప్ తీసుకుని మరో మూవీ చేయాలి అన్న అభిప్రాయంలో ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: