నటుడు రవి వర్మ మంచి సమర్ధత కలిగిన నటుడుగా గుర్తింపు ఉన్నప్పటికీ అవకాశాలు చాల తక్కువగా వస్తున్నాయి. అయినప్పటికీ రవి వర్మకు నటుడుగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ విలక్షణ నటుడు ఈ మధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రిన్స్ మహేష్ బాబు పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 

మహేష్ పైకి చాల గంభీరంగా కనిపించే వ్యక్తి అయినప్పటికీ అతడి మనస్తత్వం చిన్న పిల్లవాడి మనస్థత్వంలా ఉంటుందని కామెంట్స్ చేసాడు. అంతేకాదు మూవీ షూటింగ్ సమయంలో మహేష్ జోక్స్ వేస్తూ చేసే అల్లరితో యూనిట్ లోని వారంతా తెగ నవ్వుకుంటూ ఉంటారు అన్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.

గతంలో మహేష్ తో కలిసి తాను ఒక మూవీలో నటిస్తున్నప్పుడు ఆ షూటింగ్ స్పాట్ లో మహేష్ తన వద్దకు చాల సీరియస్ గా వచ్చి ‘నీవు డ్రగ్స్ బాగా తీసుకుంటున్నావు అన్నమాట’ అని అందరి ముందు అనడంతో తాను షాక్ అయిన విషయాన్ని రవి వర్మ వివరించాడు. అయితే అలా మహేష్ తనను ఎందుకు కామెంట్ చేసాడో తెలియక చాల తికమక పడుతున్నప్పుడు మహేష్ తనంతట తానుగా చెప్పిన నిజాన్ని విని తన మైండ్ బ్లాంక్ అయింది అన్న విషయాన్ని బయటపెట్టాడు. 

తాను గతంలో ‘వెన్నెల’ అన్న సినిమాలో డ్రగ్స్ కు బానిస అయిన పాత్రలో నటించినప్పుడు తన నటనను ఆ మూవీలో మహేష్ చూసాడని తన నటనలో సహజత్వం బాగా కనిపించడంతో నిజంగానే డ్రగ్స్ తీసుకున్నావా అంటూ తనను మహేష్ ప్రశ్నించడంతో తన మనసు తేలికపడిన విషయాన్ని రవి వర్మ ఆ ఇంటర్వ్యూలో గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు మహేష్ తాను ఒక సూపర్ స్టార్ అన్న విషయం మరిచిపోయి చిన్న నటులు దగ్గర నుండి సీనియర్ నటుల వరకు ప్రేమగా పలకరించే అతడి నవ్వులో ఎదో ఒక మ్యాజిక్ ఉంది అంటూ రవి వర్మ చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: