టాలీవుడ్ లో వున్న  గొప్ప కమెడియన్ లలో  శ్రీనివాస్ రెడ్డి ఒకరు. ఇడియట్  సినిమా తో ఈ కమెడియన్  దశ తిరిగింది.  బ్రహ్మనందం , అలీ , సునీల్  టైం నడుస్తున్నప్పడి నుండే  వారితో పాటు  అవకాశాలు దక్కించుకున్న శ్రీనివాస్ రెడ్డి.. ప్రస్తుతం  టాప్ కమెడియన్  గా వెలుగొందుతున్నాడు.  కొందరు  డైరెక్టర్లు  శ్రీనివాస్ రెడ్డి కోసమే  ప్రత్యేకంగా  క్యారెక్టర్లు  రాస్తారు అలాంటి వారిలో  ముందు వరసలో  ఉంటాడు  యంగ్ డైరక్టర్ అనిల్ రావిపూడి. ఆయన  తెరకెక్కించిన మూడు సినిమాల్లో  శ్రీనివాస్ రెడ్డి కి మంచి పాత్రలే దొరికాయి.    
 
 
ఇక తన కెరీర్ పీక్స్ లో ఉండగా శ్రీనివాస్ రెడ్డికి వున్నట్లుండి  డైరెక్టర్ గా మారాలనిపించింది. మామూలుగానే  సినిమా ఆర్టిస్టుల అందరికి  డైరెక్షన్ అనేది ఓ కల. అలాగే  శ్రీనివాస్ రెడ్డి  కి కూడా ఆ కల నెరవేర్చుకోవాలనిపించింది. కట్ చేస్తే  'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు'  అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.  దీనికి హీరో  , డైరెక్టర్ , నిర్మాత  అన్ని  శ్రీనివాస్ రెడ్డినే.  మాజీ జబర్దస్త్  కమెడియన్లందరికి   వేషాలు ఇచ్చి ఈసినిమా ను  తెరకెక్కించాడు.  వారికి రెమ్యునరేషన్ కూడా పూర్తిగా ఇవ్వలేదు. సినిమా హిట్టైతే అందరికి  పూర్తిగా సెటిల్ చెయ్యాలనుకున్నాడు  కానీ  నిన్న విడుదలైన ఈ చిత్రం పూర్ రేటింగ్స్ ను రాబట్టుకోవడంతో థియేటర్లన్ని వెలవెలబోతున్నాయి.  థియేటర్లకు  రెంట్లు ఎదురు చెల్లించాల్సిన  పరిస్థితి వచ్చింది. ఈచిత్రానికి శ్రీనివాస్ రెడ్డి  2కోట్లవరకు  ఖర్చు పెట్టాడట. దాంతో ఇప్పుడు ఆ రెండు కోట్లు  తిరిగి రావడం దాదాపు అసాధ్యం. అలా  ఈ చిత్రంతో శ్రీనివాస్ రెడ్డి  భారీగానే నష్టపోయాడు.  శ్రీనివాస్ రెడ్డి,  సరిలేరు నీకెవ్వరు లాంటి  భారీ ఆఫర్ ను  వదులుకొని మరి ఈ సినిమా ను తెరకెక్కించడం కొస  మెరుపు. ఆఫర్లు లేనప్పుడైనా  ఇలాంటి ప్రయోగం చేస్తే ఓకే కానీ బంగారం లాంటి  అవకాశాన్ని కాదని  డైరెక్షన్ చేసినందుకు  శ్రీనివాస్ రెడ్డికి  భారీ దెబ్బ పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: