తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ రవి పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా ఈ టీవీ కామెడీ రియాల్టీ షోలలో కడుపుబ్బా నవ్వించే యాంకరింగ్ తో అదరగొట్టే పెర్ఫార్మెన్స్ తో అమ్మాయిలను ఆకట్టుకునే విధంగా యాంకరింగ్ చేయడం లో టీవీ చూస్తున్న ప్రేక్షకులను అలరించే విధంగా యాంకరింగ్ చేస్తూ కెరియర్ సాగించే రవి తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. తెలుగు టెలివిజన్ చాలా చానల్స్ లో చాలా ప్రోగ్రామ్స్ లో అలరించే విధంగా కార్యక్రమాలు చేస్తూ దూసుకుపోతున్నారు యాంకర్ రవి. ఈ నేపథ్యంలో ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 3 సభ్యులతో సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు చేసి అనేక ప్రశ్నలు తో హౌస్ గురించి ఇంకా అనేక విషయాల గురించి రాబట్టిన యాంకర్ రవికి తాజాగా యాక్సిడెంట్ అయింది.

 

విషయంలోకి వెళితే యాంకర్ రవి డ్రైవ్ చేస్తున్న కారును ఓ డిసిఎం వ్యాన్ వచ్చి తన కార్‌ను ఢీ కొట్టిందని.. ఈ ప్రమాదంలో తనకేం కాలేదు కానీ కార్ మాత్రం డ్యామేజ్ అయిందని త‌న యూ ట్యాబ్ ఛానెల్లో పేర్కొన్నాడు. రోడ్డు రూల్స్ పాటిస్తూ కరెక్ట్ మార్గంలో వెళ్తుండగా రాంగ్ రూట్ లో వచ్చి దారుణంగా తన కారును ఢీకొట్టడం జరిగిందని అలాగే పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోయాడని అంతే కాకుండా అతను తాగి డ్రైవ్ చేస్తున్నాడు అని యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానల్ లో పేర్కొన్నాడు.

 

అంతేకాకుండా అంత దారుణంగా డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తే నడిరోడ్డు మీద ప్రాణాలు పోవా అంటూ ప్రశ్నించాడు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదలు ఎక్కువ తాగి డ్రైవ్ చేయడం వల్ల జరుగుతున్నాయని పేర్కొన్నాడు. అయితే జరిగిన ఈ ఘటనలో తనకు ఏమీ కాలేదని తనతో పాటు తన డ్రైవర్ కూడా ఉన్నాడని అదృష్టం ఉండి ఇద్దరికీ ఏం కాలేదని దగ్గర్లో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు యాంకర్ రవి తెలిపాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: