ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మంచి సందేశాత్మక చిత్రమని తెలుస్తోంది. ఇంతకీ సినిమా పేరేంటో తెలుసా ‘‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ అంతేకాదు ఈ చిత్రం గురించి గొప్ప నటుడైన రాజశేఖర్ మాట్లాడుతూ.... ఈ చిత్రానికి ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి. ఈ సినిమాలో ప్రతిఒక్కరు బాగా నటించారు’’ అని ఈ హీరో అన్నారు. జె.కరుణ కుమార్ దర్శకత్వంతో సంజయ్ ఇదామ, శ్రీనాథ్ మాగంటి, అహల్య సురేష్, ప్రియ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించారు.
ఈ నెల 27న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా పాటల విడుదల వేడుకలో రాజశేఖర్ ‘‘కరుణ కుమార్ ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర పనిచేసారు ఇక సినిమా ఎలావుంటుందో మాటల్లో చెప్పలేము కరుణకుమార్ ఈ సినిమాను బాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో పాటలు చాలా బాగున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కథా బలం ఉన్న సినిమాలు ఇప్పుడే కాదు ఎప్పుడూ హిట్ అవుతుంటాయి.
ఈ చిత్రంలో కథతో పాటు సందేశం కూడా ఉన్నందున తప్పకుండా సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘ విద్యార్థుల గురించి ఈ సినిమాలో ఒక మంచి సందేశం ఉంది. ఇక నటి జీవిత కూడా పాటల విడుదల వేడుకలో మాట్లాడుతూ .. ఈ సినిమా ప్రతి ఒక్క తల్లిదండ్రులు, విద్యార్థులు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు . కాగా నిర్మాత మల్కాపురం శివకుమార్‘‘ఈ చిత్రం నాకు చాలా నచ్చింది.. అందుకే స్వయంగా నేనే విడుదల చేస్తున్నా’’ అన్నారు .
ఇప్పటివరకు ‘‘తెలుగులో నేను తీసిన మూడో సినిమా ఇది. డబ్బు వస్తుందా?లేదా? అనే విషయాలు పక్కన పెడితే మంచి సినిమా తీశానన్న సంతృప్తి నాకు ఉంది’’ అన్నారు బి.ఓబుల్ సుబ్బారెడ్డి. కరుణ కుమార్ ఈ సినిమాలో ‘‘ఆత్మహత్య సమస్యకు పరిష్కరం కాదని చెప్పాం’’ అన్నారు . నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.