ఎన్టీఆర్ బయోపిక్ లను తెరకెక్కించి న ఘనత ఒక్క బాలయ్యదే.. ఈయన వెలుగు లోకి తీసుకొచ్చిన బయోపిక్ లు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.. కానీ ఈయనకు మాత్రం ఒక్క హిట్ కూడా పడలేదని అర్థమవుతుంది.. దీంతో తర్వాత చిత్రాల కథ ఎంపిక విషయం లో తగు జాగ్రత్తలు వహించిన బాలయ్య ఇపుడు కే ఎస్ రవికుమార్ ద్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా లో కొత్త లుక్ తో ఉన్న బాలయ్య అందరి మనసును ఆకట్టుకున్నాయి

 

నందమూరి బాలకృష్ణ ఈ మధ్య సినిమాల జోరు మరింత పెంచాడు. 105 వ సినిమాగా రూలర్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి కావడం తో మరో సినిమాను బాలయ్య లైన్ లో పెట్టాడు. ఈ సినిమాలో కూడా బాలయ్య రొమాంటిక్ లుక్ లో కనిపిస్తాడని సమాచారం. 

 

ఈ సినిమాలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు.ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు కూడా ఈ మద్యే ప్రారంభం అయ్యాయి. ఇకపోతే రూలర్ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. 

 


ఈ చిత్రం విడుదలయ్యా కే బోయపాటి సినిమాను సెట్స్ పై తీసుకెళ్లనున్నారని సమాచారం. మరి ఈ చిత్రంలో బాలయ్య సరసన మాహానటి ఫెమ్ కీర్తిసురేష్ నటించనుందని వార్తలు వినపడుతున్నాయి. ఇక విలన్ పాత్రలో సంజయ్ దత్ నటించనున్నారని సమాచారం. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు. త్వరలో     నే ఈ చిత్రం నుండి అధికారక ప్రకటన వెలువడనుంది. ఏది ఏమైనా కూడా బాలయ్య సినిమాల స్పీడ్ పెంచడం తో  నందమూరి అభిమానుల సంతోషానికి హద్దులు లేవనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: