రజినీకాంత్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.  దర్బార్ సినిమా రిలీజ్ కు సిద్ధం కాబోతున్నది.  దర్బార్ మూవీపై అనేక అంచనాలు ఉన్నాయి.  జనవరి 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఎలా ఉండబోతుందనే విషయం తెలియాల్సి ఉన్నది.  మురుగదాస్ కాబట్టి ఏదో ఒక మన చేసే ఉంటాడు.  


ఇక సాంగ్స్ మాస్ తో పాటు యూత్ ను కూడా ఎట్రాక్స్ చేస్తున్నాయి.  క్యాచీ అండ్ ఫ్రెష్ ట్యూన్స్ అవడంతో ఆల్బమ్ జబర్దస్త్ గా ఉన్నది.  ఇక ఇదిలా ఉంటె ఈ మూవీ తరువాత రజినీకాంత్ తన కొత్త సినిమా రజిని 168 ఈరోజే ప్రారంభం అయ్యింది.  అజిత్ కు వరసగా నాలుగు హిట్స్ అందించిన శివ దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం అయ్యింది.  ఈ సినిమాకు వ్యూహం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.  


అజిత్ తో నాలుగు సినిమాలు వి అనే అక్షరంతోనే మొదలయ్యాయి.  దీంతో శివ ఈ వి సెంటిమెంట్ ను కంటిన్యూ చేయబోతున్నాడు. ఇందులో మీనా, కుష్బూ, కీర్తి సురేష్ తదితరులు నటిస్తున్నారు.  ఓ పల్లెటూరి నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.  జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నది.  ఈ సినిమా తరువాత రజిని తన 169 సినిమా కూడా అప్పుడే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.  


2021 లో ఎన్నికలు రాబోతున్నాయి.  ఈ ఎన్నికలు మొదలయ్యే సమయానికి రజినీకాంత్ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వస్తారని సమాచారం.  రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఎలా మైంటైన్ చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది.  సినిమా పరంగా చూసుకుంటే రజినీకాంత్ కు పెద్దగా ఇబ్బందులు లేదు. ఎన్ని ప్లాప్ లు వచ్చినా రజిని  తగ్గదు.  మరి రాజకీయాల్లో ఎలా ఉంటుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: