కొంత నిజం... కొంత కల్పనా కలిస్తే.... ఫిక్షన్ అంటారు.  తెలుగులో ఫిక్షన్ కథలతో వచ్చే సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి.  ఇంగ్లీష్ లోనే ఎక్కువగా ఇలాంటి సినిమాలు వస్తుంటాయి.  కానీ, తెలుగులో మాత్రం అతి తక్కువగా వస్తున్నాయనే చెప్పాలి.  అలాంటి అతి తక్కువ  సినిమాల్లో  ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ప్రస్తుతం మూవీ పాడేరులో జరుగుతున్నది. 

 

 చారిత్రాత్మక వాస్తవిక పాత్రలైనా అల్లూరి సీతారామ రాజు, కొమరం భీం కథలను ఆధారం చేసుకొని, వారి పాత్రలలో కొంత కల్పనను జోడించి ఫిక్షన్ గా సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.  రాజమౌళి సినిమాల్లో ఇదొక బెస్ట్ సినిమాగా చెప్పుకోవచ్చు.   మల్టీస్టారర్ గా సినిమాను తెరకెక్కిస్తున్నాడు.  వచ్చే ఏడాది జులై 30 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  


ఇక ఇదిలా ఉంటె, సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.  ఎన్టీఆర్ ను, రామ్ చరణ్ ను ఒకే ఫ్రేమ్ లో స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  బాహుబలి తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.  మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ కు జోడిగా అలియా నటిస్తోంది. 


ఎన్టీఆర్ కు జోడిగా బ్రిటిష్ భామ ఒలీవియా నటిస్తుండటం విశేషం.  ఇండియానా జోన్స్ సినిమాలో విలన్ పాత్ర చేసిన నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.  అజయ్ దేవగణ్, సముద్రఖని తదితరులు సైతం ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం.  ఈ సినిమా కోసం దాదాపుగా రూ. 300 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా  బిజినెస్ పరంగా భారీగా అమ్ముడు పోయింది.  డిజిటల్ రైట్స్ కూడా అదే స్థాయిలో అమ్ముడయినట్టు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: