బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ మధ్య ప్రేమ వ్యవహారం నడిచిన విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారు అని అందరూ అనుకుంటున్న టైంలో.. ఓ పార్టీలో చిన్న కారణం వల్ల సల్మాన్ అందరి ముందు ఐశ్వర్య ని చంప మీద కొట్టాడు. అప్పుడు స‌ల్మాన్‌కు దూరమైన ఐశ్వర్య వివేక్ ఒబెరాయ్ తో ప్రేమలో పడిందన్న వార్తలు కూడా వచ్చాయి.

 

వివేక్ - ఐశ్వర్య చాలాకాలం పాటు సన్నిహితంగా ఉండటంతో వారిద్దరూ ప్రేమించుకున్నారు.. అని అందరూ అనుకున్నారు. సల్మాన్ ఖాన్ తాగేసి ఫోన్ చేసి మాట్లాడాడు.. నిన్ను చంపేస్తానని బెదిరించాడు అట. దీంతో భయపడిపోయిన వివేక్ ఒబెరాయ్ తర్వాత మీడియా సమావేశం పెట్టి సల్మాన్ ఖాన్ తనను తిట్టిన‌ విషయాన్ని మీడియాకు వెల్లడించాడు. నాటి వివేక్ మీడియా స‌మావేశం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

 

వివేక్ ఆ స‌మావేశం 2003 ఏప్రిల్ 1న మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీడియా స‌మావేశంలో వివేక్ మాట్లాడుతూ స‌ల్మాన్ న‌న్ను బండ బూతులు తిట్టాడు... నువ్వు రోజుకు ఒక అమ్మాయి చొప్పున వెంట వేసుకుని తిరుగుతావు. నీకు చాలా మందితో లైంగిక సంబంధాలు ఉన్నాయి. నీకు ఐశ్వర్య కావాలా అంటూ తిట్టాడ‌ని చెప్ప‌డంతో అప్ప‌ట్లో మీడియా స‌ల్మాన్‌ను గ‌ట్టిగా టార్గెట్ చేసింది.

 

అయితే అప్పట్లో బాలీవుడ్ వర్గాలు మాత్రం వివేక్ తప్పు చేశాడని మందలించాయి. ఐశ్వర్య సైతం పబ్లిక్ గా తన పేరు చెప్పాడ‌ని ఆగ్రహంతో వివేక్‌కు బ్రేక‌ప్ చెప్పేసింది. ఒకవేళ ఆ సంఘటన జరగకుండా ఉంటే వివేకి కెరీర్ ఎక్కడో ఉండేదని సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఈ సంఘటన జరిగి 19 సంవత్సరాలు అయినా ఇప్ప‌ట‌కీ ఏదోలా నానుతూనే ఉంటుంది. వివేక్ గతంలో పలు సార్లు సల్మాన్ కు క్షమాపణ చెప్పినా కూడా సల్మాన్ మాత్రం క్షమాపణ అంగీకరించలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: