తాజాగా  నటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం టెడ్డీ. ఈ చిత్ర దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్‌ ఆయన మాట్లాడుతూ ఇది పలు విశేషాలతో కూడి ఉంటుందంటున్నారు . ఇంతకు ముందు టిక్‌ టిక్‌ టిక్‌ అనే స్పై చిత్రాన్ని ఈయన తెరకెక్కించారన్నది గమనార్హం. అంతేకాదు శక్తిసౌందర్‌రాజన్‌ గ్రాఫిక్స్‌తో కూడిన చిత్రాలను రూపొందించడంలోఈయన సిద్ధహస్తుడని చెప్పవచ్చు. ఈయన తాజా చిత్రంలో అధిక ప్రాధాన్యత   గ్రాఫిక్స్‌కు  ఉంటుందట. ఆర్యకు జంటగా ఎవరో కాదు  ఆయన భార్య సాయేషాసైగల్‌ నటిస్తున్న చిత్రం ఇది.

 

ఈ చిత్తాన్ని జ్ఞానవేల్‌రాజా స్టూడియోగ్రీన్‌ పతాకంపై  నిర్మిస్తున్నారు. కాగా మంగళవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను  విడుదల చేశారు.  టెడ్డీబేర్‌ ఆర్య వెనుక నిలబడి తొంగి చూస్తున్న ఫస్ట్‌లుక్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. టెడ్డీ చిత్రం కథేంటి? టెడ్డీబేర్‌ పాత్ర విశేషాలు ఏమిటి? గ్రాఫిక్స్‌ ప్రాధాన్యత ఎంత? వంటి పలు ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి .

 

దీనిపై ఈ చిత్ర దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్‌ మాట్లాడుతూ... చిత్రంలో  టెడ్డీబేర్‌కు ఆర్యకు చాలా సంబంధం ఉంటుంది. అయితే ఈ చిత్రానికి మొదట్లో చాలా పేర్లను పరిశీలించాం కానీ చివరికి అందరికీ పరిచయం అయిన టెడ్డీ పేరునే చిత్రానికి ఖరారు చేశాం.  టైటిల్‌ ప్రాముఖ్యత మీకు టెడ్డీ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూస్తేనే అర్థం అయ్యి ఉంటుంది. ఎలా టెడ్డీబేర్‌ను పెద్దల నుంచి పిల్లల వరకూ ముద్దులాడతారో అలా ఈ టెడ్డీ చిత్రాన్ని చూసి అలరిస్తారు. అలా చిత్రాన్ని తయారు చేయడానికి శ్రమిస్తున్నాం.

 

దీన్ని  పలానా జానర్‌ చిత్రం అని ఒక్క మాటలో  చెప్పడం కుదరదు. చిత్రంలో హీరోతో పాటు కంప్యూటర్‌కు సంబంధించిన పాత్ర ఉంటుంది.   గ్రాఫిక్స్‌లో మాత్రమే దాన్ని రూపాన్ని ఆవిష్కరించాల్సి ఉంటుంది.  అదే టెడ్డీబేర్‌ పాత్ర. ఇదే చిత్రంలో ప్రత్యేకం. నిజానికి చిత్రంలో సెకెండ్‌ పాత్ర ఇదే.  పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో సహజత్వానికి అద్దం పట్టేలా టెడ్డీబేర్‌ను రూపొందిస్తున్నాం. అంతేకాదు ఈ టెడ్డీబేర్‌ ఫైట్స్‌ కూడా చేస్తుంది. అదే ప్రేక్షకులకు  కొత్త అనుభూతిని కలిగిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: