నిన్న ‘ఆర్ ఆర్ ఆర్’ లో జూనియర్ లుక్ కు సంబంధించి ఒక చిన్న వీడియో లీక్ అయిన నేపధ్యంలో వచ్చిన అలజడి రాజమౌళికి షాక్ ఇవ్వడమే కాకుండా ఇలాంటి పొరపాట్లు ఇక ముందు ఎప్పుడు జరగకుండా జక్కన్న చాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై ఈ లీకులు ఎలా వచ్చాయి ఆరాలు తీస్తున్న రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి కీలక యూనిట్ సభ్యుల నుండి కూడ వారి సెల్ ఫోన్స్ ను షూటింగ్ స్పాట్ కు వచ్చే ముందు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక బాస్కెట్ లో వేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ విషయంలో చరణ్ జూనియర్ లకు కూడ మినహాయింపు లేదు అంటూ రాజమౌళి సమ న్యాయం పాటించినట్లు వార్తలు వస్తున్నాయి. 

భవిష్యత్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ స్పాట్ నుండి ఎటువంటి లీకులు రాకుండా కట్టడి చేయడానికి ఒక స్పెషల్ టీమ్ ను ముంబాయి నుండి రాజమౌళి ప్రత్యేకంగా రప్పిస్తున్నట్లు కూడ వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ‘రామ రౌద్ర రుషితం’ అన్న టైటిల్ రాజమౌళి ఇంచుమించు ఖరార్ చేయడంతో ఈ టైటిల్ తో ఒక అధికారిక పోస్టర్ ను రాబోతున్న జనవరి 1న విడుదల చేయాలని రాజమౌళి ఆలోచన అని తెలుస్తోంది. 

వాస్తవానికి ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ ఆఫర్స్ బయ్యర్ల నుండి అనేకం వస్తున్నా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత మాత్రమే ఈ బిజినెస్ డీల్స్ ను డీల్ చేయమని రాజమౌళిమూవీ నిర్మాత దానయ్యకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు జూనియర్ చరణ్ ల వ్యక్తిగత స్వేచ్చను కూడ రాజమౌళి కట్టడి చేస్తున్నాడు అని వస్తున్న వార్తలను బట్టి జక్కన్న ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎంత కఠినంగా ఉంటాడో అర్ధం అవుతుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: