రామ్ గోపాల్ వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. వర్మ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి సినిమాపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.  ఒక వర్గం వాళ్ళను కించపరిచేలా ఈ సినిమాలో వర్మ చూపించారని టాక్.  అయితే, వర్మ మాత్రం వాటి గురించి పట్టించుకోలేదు.  తన పని తాను చేసుకుంటూ పోతూ.. తనకు నచ్చినట్టుగా సినిమాను షూట్ చేస్తూ సినిమా తీశాడు.  


అయితే, సినిమా రిలీజ్ విషయంలో ఏర్పడిన గందరగోళం దాటుకొని సినిమా ఎట్టకేలకు బయటపడింది.  గతంలో ఎప్పుడు లేనంతంగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు పబ్లిసిటీ వచ్చింది.  తెలుగుదేశం పార్టీని డైరెక్ట్ గా సినిమాలో ఉతికి ఆరేశారు.  కేవలం ఫన్ కోసం మాత్రమే సినిమా అని చెప్తున్నా, ఫన్ తో పాటు టీడీపీపై తనకు ఉన్న అక్కసు మొత్తం వెళ్లగక్కినట్టు తెలుస్తోంది. 


సినిమా రిలీజ్ కు ముందు పబ్లిసిటీ పెరగడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.  సినిమా రిలీజ్ తరువాత కూడా అందులో కావాల్సిన సెటైర్లు ఉన్నాయని అర్ధం అవుతున్నది.  అందుకు ఉదాహరణ ప్రెస్ మీట్ సీన్స్.  పదేపదే ప్రెస్ మీట్స్ పెడుతూ.. వేలెత్తి చూపిస్తూ ఆఫ్ట్రాల్ నువ్వు ఈవీఎం ముఖ్యమంత్రివి అని ఎద్దేవా చేస్తుంటాడు.  అంతేకాదు, జగన్నాథ్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని, కుట్రలు బయటపెట్టి భూస్థాపితం చేస్తానని చెప్తుంటాడు.  ఇందులో దేవినేని ప్రెస్ మీట్ ఆసామిగా పేరు పెట్టాడు వర్మ.  


చాలా కాలం తరువాత వర్మ తిరిగి ఫుల్ మీల్స్ పెట్టారని, వివాదాల చుట్టూనే కథను నడిపిస్తూ... ఆకట్టుకునే విధంగా సినిమాను తీర్చి దిద్దారని అంటున్నారు.  మొత్తానికైతే వర్మ ఈ సినిమాతో తిరిగి మరలా ట్రాక్ లోకి వచ్చారని చెప్పొచ్చు.  ఇక ఇదిలా ఉంటె, రేపు డిసెంబర్ 13 వ తేదీన వర్మ దర్శకత్వం వహించిన ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ సినిమా ఇంటర్నేషనల్ ట్రైలర్ బ్రూస్ లీ సొంత ఊర్లో రిలీజ్ చేయబోతున్నాడు వర్మ.  ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: