తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్  నటించిన  లేటెస్ట్ మూవీ  బిగిల్ ఇటీవల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ వెర్షన్లు కలిపి  250కోట్ల వసూళ్లను సాధించి సౌత్ లో  ఈఏడాది  బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా రికార్డు సృష్టించింది.   ఇక ఈ చిత్రం  తెలుగు లో విజిల్ గా విడుదలై  తెలుగు రాష్ట్రాల్లో కూడా అదరగొట్టింది.  ఫుల్ రన్ లో ఈ చిత్రం అక్కడ 12కోట్ల షేర్ ను రాబట్టి  హిట్ అనిపించుకుంది. ఈ చిత్రం  తో విజయ్ కి తెలుగులో మార్కెట్ మరింతగా  పెరిగింది. ఇంతకుముందు  విజయ్ నటించిన సర్కార్ కూడా  7కోట్ల షేర్ తో సూపర్ హిట్  అనిపించుకోగా తాజాగా  విజిల్  తెలుగులో విజయ్ కి  వరసగా  రెండో విజయాన్ని అందించింది. 
 
 
ఇక ఈ సినిమా  తమిళ  , తెలుగు వెర్షన్ లు  ఈరోజు  అమెజాన్ ప్రైమ్ లో  విడుదలైయ్యాయి.  ప్రైమ్  సబ్ స్క్రిప్షన్ వున్న  వారు ఈ చిత్రాన్ని చూసేయచ్చు.  స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో  అట్లీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో   లేడీ సూపర్ స్టార్   నయనతార కథానాయికగా  నటించగా  ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.  భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని  ఏజిఎస్ ఎంటర్ టైన్మెంట్స్  పతాకం పై కల్పాతి ఎస్ అగోరం  నిర్మించాడు.  ఇక అట్లీ - విజయ్ లకు బిగిల్ హ్యాట్రిక్ విజయాన్ని అందించింది.  ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన  తెరి , మెర్సల్  సూపర్ హిట్లు అవ్వగా తాజాగా బిగిల్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం విజయ్ ఖైదీ ఫేమ్ లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్ లో  తన 64 వచిత్రంలో  నటిస్తున్నాడు. గత కొద్దీ రోజులనుండి శరవేగంగా  చిత్రీకరణ  జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: