అక్కినేని వారింట పెళ్లి సందడి మొలైంది..అయితే ఈ పెళ్లి అఖిల్ ది కాదు... అక్కినేని నాగార్జున సోదరుడైన వెంకటేశ్ కుమారుడిని నిశ్చితార్థం నిన్న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అక్కినేని నాగార్జున కుటుంబం సందడి చేసింది. అంగరంవైభవంగా జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు.. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో సందడి మామూలుగా లేదు..

 

ఈ కార్యక్రమంలో నాగార్జున, అమల,చైతన్య, అఖిల్ పాల్గొని సందడి చేశారు. అయితే సుశాంత్, సుమంత్‌, సుప్రియ, నాగసుశీలతో ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కానీ ఎక్కడా అక్కినేని కోడలు సమంత మాత్రం కనిపించలేదు.ఈ విషయం పై పలువురు అక్కినేని అభిమానులు ఆలోచనలో పడ్డారు.


సామ్ షూటింగ్ లు ఏవి లేనట్లు ఉన్నాయి. మరి ఈ నిశ్చితార్థ వేడుకకు ఎందుకు రాలేదు అనే వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఈ వేడుకకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి.. వాటికి కామెంట్లు కూడా బాగానే వస్తున్నాయి. సమంత ఎందుకు మిస్ అయింది అని కామెంట్లు కూడా అందుకుంటున్నాయి.


ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను అక్కినేని వారబ్బాయి అఖిల్ తన ఫ్యామిలీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు అఖిల్. ఈ సందర్భంగా సోదరుడు ఆదిత్యకు విషెష్ అందించారు. అయితే ఈ ఫ్యామిలీ ఫొటోలో అక్కినేని కోడలు, నాగ చైతన్య క్యూట్ వైఫ్ సమంత మిస్ కావడంతో సమంత ఎక్కడ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. అయితే సమంత షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల ఈ వేడుకకు హాజరుకాలేకపోయినట్టు తెలుస్తోంది. అయితే అఖిల్ షేర్ చేసిన ఈ నిశ్చితార్థ వేడుక ఫొటో అవుతుండగా.. మరి నీ పెళ్లి ఎప్పుడు అఖిల్ అంటూ అప్పట్లో క్యాన్సిల్ అయిన పెళ్లిని గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. మరి అఖిల్ పెళ్లి ఎప్పుడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: