ఈరోజు అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ‘వెంకీ మామ’ ప్రీమియర్ షోలు అమెరికాలో చూసిన వారు చెపుతున్న అభిప్రాయాలను బట్టి ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా అంతటిలో వెంకటేష్ స్క్రీన్ ప్రెజన్స్ తప్పితే నాగ చైతన్య క్యారెక్టర్ ఎక్కడా ఎలివేట్ కాలేదని ఈ సినిమాను ఇప్పటికే చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. 

ఈ సినిమాకు సంబంధించి పాటలు బాగున్నా ఫస్ట్ హాఫ్ కామెడీ తప్ప సెకండ్ హాఫ్ అంతా ఎవరేజ్ గా ఉందని మరికొందరు ఓవర్సీస్ ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ట్విట్స్ ద్వారా తెలియచేస్తున్నారు. టోటల్ ఈ మూవీని చూసిన వారికి వెంకటేష్ వన్ మ్యాన్ షో తప్పించి మరి ఏ విషయం కొత్తగా కనిపించదు అన్న కామెంట్స్ కూడ ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి. 

ముఖ్యంగా ఈ మూవీ సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ మోతాదు ఎక్కువ కావడంతో అది సగటు ప్రేక్షకులకు పెద్దగా నచ్చక పోవచ్చు అన్న అభిప్రాయాలు కూడ ఓవర్సీస్ ప్రేక్షకుల నుండి అందుతున్నాయి. అయితే ఎమోషనల్ సీన్స్ లో ఈ మూవీలోని లీడ్ యాక్టర్స్ అంతా తమతమ పాత్రలలో జీవించి ఈ సినిమాను నిలబెట్టడానికి చాల గట్టి కృషి చేసారని కామెంట్స్ కూడ వస్తున్నాయి.

అయితే ప్రస్తుతం బయటకు వచ్చింది కేవలం ఓవర్సీస్ టాక్ మాత్రమే ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇచ్చే స్పందన బట్టి ఈ మూవీ ఏ రేంజ్ హిట్ అన్న విషయం తేలడానికి మరికొద్ది గంటలు పట్టే ఆస్కారం ఉంది. 45 కోట్లపెట్టుబడి ఈ మూవీ పై పెట్టడంతో ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే తప్ప ‘వెంకీ మామ’ నిర్మాతలు గట్టెక్కే పరిస్థితి లేకపోవడంతో ఈ మూవీకి ప్రాధమీకంగా వస్తున్న డివైడ్ టాక్ ‘వెంకీ మామ’ ను ఏ స్థాయిలో నిలబడుతుంది అన్న విషయం ఈ రోజు తరువాత మాత్రమే క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: