విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటిస్తోన్న వెంకీ మామ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్న సంగతి తెల్సిందే. టాలీవుడ్‌లో గ‌త నెల‌లుగా స‌రైన సినిమాలు లేక‌పోవ‌డంతో ట్రేడ్ కూడా ఫీడింగ్ లేక విల‌విల్లాడుతోంది. ఎట్ట‌కేల‌కు ద‌గ్గుబాటి, అక్కినేని హీరోలు... అందులోనూ నిజ‌జీవితంలో మేన‌మామ‌, మేన‌ళ్లుడు క‌లిసి న‌టించిన సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకీ మామ కొంతవరకైనా థియేటర్ల కరువుని తీర్చగలదని అంద‌రూ అనుకున్నారు.

 

ఇక వెంకీ మామ టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ వెంకీ మామపై మంచి అంచనాలను ఏర్పరిచాయి. అటు వెంకటేష్, ఇటు నాగ చైతన్య, దర్శకుడు బాబీ ఇలా అందరూ సక్సెస్ ల మీద ఉండడం.. అటు ఇద్ద‌రు హాట్ హీరోయిన్లు రాశీ ఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ ఉండ‌డంతో ఈ సినిమాపై మంచి పాజిటివ్ బ‌జ్ అయితే ఉంది. సినిమా ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్ అవుతుంద‌నే ప్ర‌తి ఒక్క‌రు న‌మ్మ‌కంతో ఉన్నారు.

 

ఇక ఇప్పుడు సినిమాకు ప్రీమియ‌ర్లు ప‌డ‌డంతో బిలో యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. సినిమా ఫ‌స్టాఫ్ ఓ మోస్తరుగా ఉన్నా.,.. సెంక‌డాఫ్ లో బాబీ డైరెక్ష‌న్ లోపాలు.. వీక్ స్క్రీన్ ప్లే, నెరేష‌న్ సినిమాను డ‌ల్ చేశాయ‌న్న టాక్ ఉంది. ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల వరకే రు. 31 కోట్ల బిజినెస్ జ‌రిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ రు. 36 కోట్లు దాటింది. మ‌రి ఈ టాక్‌తో అంత భారీ టార్గెట్ ఎలా రీచ్ అవుతుందో ?  చూడాలి.

 

వెంకీ మామ ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్‌:

 

నైజాం- 8.6 కోట్లు

 

వైజాగ్- 4.3 కోట్లు

 

ఈస్ట్- 2.9 కోట్లు

 

వెస్ట్- 2.5 కోట్లు

 

కృష్ణ- 2.7 కోట్లు

 

గుంటూరు-3.2 కోట్లు

 

సీడెడ్- 5.4 కోట్లు

 

నెల్లూరు- 1.4 కోట్లు

 

కర్ణాటక – 2.0 కోట్లు

 

ఓవర్సీస్- 2.4 కోట్లు

 

రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.6 కోట్లు
---------------------------------------------
టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్: 36 కోట్లు
---------------------------------------------

 

మరింత సమాచారం తెలుసుకోండి: