ఫైర్ బ్రాండ్ రోజా తాజాగా ఓ రిపోర్టర్ పై ఫైర్ అయ్యారు. ఏకంగా చెంప పగలకొడతా అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అవినాశ్ అనే యువకుడు రోజా తన తల్లి అని ధర్నాకు దిగడంతో అక్కడికి వచ్చిన మీడియాపై రోజా మండిపడ్డారు. ధర్నాకు దిగిన యువకుడికి మద్దతుగా రిపోర్టర్.. ‘మేడ‌మ్ మీ అబ్బాయి పేరు కౌషిక్కేనా ? అని ప్ర‌శ్నిచింది. ‘అవును.. అని రోజా సమాధానం ఇచ్చారు. ‘మ‌రి మీ చిన్న అబ్బాయి పేరు కౌషిక్ అయిన‌ప్పుడు.. ఇత‌డు మీ కొడుకు అన్న మాట నిజ‌మే క‌దా?’ అంటూ నిల‌దీస్తుంది రిపోర్ట‌ర్‌. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రోజా ‘చెంప‌ ప‌గ‌లగొడ‌తా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే..’అంటూ రిపోర్టర్ పై విరుసుకుపడ్డారు. దీంతో  రిపోర్ట‌ర్ మాట్లాడుతూ.. ‘మేడ‌మ్ య‌థావిథిగానే స్పందించారు’అనుకుంటు పక్కకు తప్పుకున్నారు. 

 

రోజా ఎంత జాలీగా ఉంటారో.. కోపం వస్తే అంతే సీరియస్ గా మారుతారు. అది నిజజీవితమైనా.. నటనలోనైనా.. ఇక రిపోర్టర్ చెంప పగల కొడతానని అన్నది మాత్రం బయట కాదండోయ్.. బుల్లి తెరమీద నవ్వులు పూయిస్తున్న జబర్దస్త్ కామీడి షోలో. జబర్దస్త్‌ కమీడియన్స్ చేసే స్క్రిట్ లో తాను భాగస్వామ్యామవుతూ పంచ్ డైలాగ్ లు, హాస్య చతురతో జడ్జిమెంట్ ఇస్తూ అలరిస్తారు. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో అవినాశ్ కలిసి కామిడీ చేశారు. 


అవినాస్ సెలెబ్రెటీ హోదా కోసం ఓ సెలెబ్రెటీ పేరు వాడుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. దాంతో ర‌ష్మీ..ఓకే నా పేరు వాడుకో అంటుంది. అయితే.. అవినాష్ న‌వ్వుతూ.. నేను సెలబ్రెటీ పేరు వాడుకుంటానన్నాను నీ పేరు కాదు అంటూ కామెడీని ప్రారంభిస్తాడు. అక్కడే అవినాశ్ ధ‌ర్నాకు కూర్చుని.. రోజా గారు నన్ను తన కొడుకుగా గుర్తించే వ‌ర‌కూ ఆమ‌ర‌ణ నిరాహ‌ర‌ణ దీక్ష’ అని.. ‘రోజాగారు నా క‌న్న త‌ల్లి’ అని.. త‌న ప‌క్క‌నే ప్ల‌కార్డ్స్ పెట్టుకుంటాడు. అవి చ‌దివిన రోజా షాక్ అవుతారు. ఇంత‌లో లేడీ రిపోర్ట‌ర్ ‘నేను సోష‌ల్ మీడియా’ అని చెబుతూ అవినాష్ ప్రాబ్ల‌మ్ తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది.

 

ధర్నాలో కూర్చున్న అవినాష్‌.. మమ్మీ.. అమ్మా.. అంటూ అరుస్తూ బాగా ఏడుస్తాడు. దాంతో ‘చంపుతా.. చంపేస్తా’ అంటూ వార్నింగ్ ఇస్తారు రోజా. ‘మీరేమో అమ్మా అమ్మా అంటున్నారు. ఆవిడేమో చంపుతా చంపుతా అంటున్నారు ఏది నిజం?’ అంటుంది రిపోర్ట‌ర్‌. ‘క‌న్న‌త‌ల్లి క‌దా.. కొడుకు త‌ప్పు చేస్తే కొడుతుంది, తిడుతుంది, చంపుతుంది.. అది స‌హ‌జం’ అంటూనే.. ‘అమ్మా.. కౌషిక్ ఎలా ఉన్నాడ‌మ్మా త‌మ్ముడూ?’ అంటూ రోజాని ప్ర‌శ్నిస్తాడు అవినాష్‌. దాంతో రోజా త‌ల ప‌ట్టుకుంటుంది. అవినాష్ మాత్రం ఆగ‌కుండా.. ‘డాడీ ఎలా ఉన్నార‌మ్మా?’ అంటాడు ఏడుస్తూ.. 

మేడ‌మ్ మీ అబ్బాయి పేరు కౌషిక్కేనా మేడ‌మ్‌? అని ప్ర‌శ్నిస్తుంది రిపోర్ట‌ర్. ‘అవును.. అయితే?’ అంటారు రోజా. ‘మ‌రి మీ చిన్న అబ్బాయి పేరు కౌషిక్ అయిన‌ప్పుడు.. ఇత‌డు మీ కొడుకు అన్న మాట నిజ‌మే క‌దా?’ అంటూ నిల‌దీస్తుంది రిపోర్ట‌ర్‌. ‘చెంప‌ ప‌గ‌లగొడ‌తా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే..’ అంటారు రోజా. వెంట‌నే రిపోర్ట‌ర్ మాట్లాడుతూ.. ‘మేడ‌మ్ య‌థావిథిగానే స్పందించారు’ అంటుంది. ఇలా ఫన్నీగా సాగింది ఆ ఎపిసోడ్. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: