ఇష్టం సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టిన కథానాయిక శ్రీయ శరన్ .. ఆ సినిమా అనుకున్నంత హిట్ ని ఇవ్వలేదు. కానీ, శ్రీయ అందానికి మార్కులు పడటంతో వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది. తర్వాత అడపాదడపా సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమాల జోరు తగ్గించింది. తర్వాత టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునతో సరసన హీరోయిన్ గా నటించినా సంతోషం సినిమా మంచి హిట్ ని అందించింది. 

 

సినిమా భారీ స్థాయిలో హిట్ అవ్వడంతో అమ్మడు ఇంకా వెనక్కి తిరిగి చుసుకొనే పనిలేకుండా సినిమా ఆఫర్లను అనుకుంటూ వస్తూ బాగానే పాపులర్ అయింది. ఇకపోతే శ్రీయ తెలుగుతూ పాటుగా, హిందీ, తమిళ్ చిత్రాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత నాగ్ తో నటించిన  నేనున్నానని, మనం సినిమాలు మంచి హిట్ ని అందించాయి. 

 

మెగాస్టార్, బాలకృష్ణ, నాగార్జున వంటి పెద్ద స్టార్ హీరోల సరసన కూడా ఈ అమ్మడు జతకట్టింది. చాలా సినిమాలలో నటించిన శ్రీయ అందం, అభినయంతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ వస్తుంది. ఇటీవలే ఏ అమ్మడు రష్యన్ ఫోటోగ్రాఫర్ ను వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది.  పెళ్లి తరువాత కూడా శ్రీయ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం శ్రీయ మూడు సినిమాల్లో నటిస్తుంది.

 

ఇది ఇలా ఉండగా పెళ్ళైన తర్వాత మరింత రెచ్చి పోతు అందాలతో రెచ్చిపోతూ రోజుకో విదంగా పోటోలను సోషల్ మాధ్యమాల్లో షేర్ చేస్తూ వస్తుంది. అమితమైన అందంతో ఆకట్టుకున్న శ్రీయ  తాజాగా ఓ బీచ్ ఒడ్డున బెల్లి డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనికి ఎవరికీ తగ్గట్లు వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. మీరు ఓ పారి చుడండి..

మరింత సమాచారం తెలుసుకోండి: