కొన్ని సినిమాలకు విడుదల కాకుండానే ఆ మూవీ పాటలు విశేష ఆదరణ పొందడంతో ఆ మూవీ పై విపరీతమైన హైప్ పెరిగిపోతోంది. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ పరిస్థితి కూడ ఇలాగే ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన మూడు సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని బాగా ఎట్రాక్ట్ చేసాయి. 

ఓ మై గాడ్ డాడీ జస్ట్ పరవాలేదనిపించుకున్నా మిగతా రెండు పాటలు యూత్ కు బాగా కనెక్ట్ అయిపోయి దుమ్ము దులుపుతున్నాయి. ముఖ్యంగా ఈ పాటలలో బన్నీ విజువల్ ఇంకా అదిరిపోతుంది అన్న వార్తలు వస్తున్నాయి. 'సామజవరగమనా' తో పాటు ‘రాములో రాములా’ సాంగ్ కూడా విపరీతమైన ప్రజాదరణ పొందడంతో ఈ పాటలకు ప్రేక్షకుల నుండి థియేటర్స్ లో విపరీతమైన స్పందన వస్తుంది అన్న అంచనాలు కొనసాగుతున్నాయి. 


ఇక త్వరలోనే రిలీజ్ కాబోతున్న ‘బుట్ట బొమ్మ’ అంటూ సాగే  ఈ సినిమాకు సంబంధించిన నాల్గవ పాటలో  బన్నీ పూజా డాన్సులు హైలైట్ అంటున్నారు. కేవలం ఈ ఒక్క పాట కోసమే బన్నీ అభిమానులు ఒకటికి రెండు సార్లు ఈమూవీ ధియేటర్లకు వస్తారని అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఇక్కడే ఒక నెగిటివ్ సెంటిమెంట్ కూడ ‘అల వైకుంఠపురములో’ మూవీని వెంటాడుతోంది. గతంలో త్రివిక్రమ్ పవన్ పవన్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ మూవీ పాటలు కూడ విడుదలకు ముందు విపరీతమైన ప్రజాదారణ పొందాయి. 

అయితే ఆ మూవీ విడుదల అయ్యాక ఆమూవీ కథ నచ్చక పోవడంతో పాటలు ఎంత హిట్ అయినప్పటికీ సగటు ప్రేక్షకుడు ఆమూవీ పై ఫెయిల్యూర్ ముద్ర వేసాడు. దీనితో త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ కథ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు అన్న విషయమై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఇంటిగుట్టు’ ఛాయలతో ఉంటుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో కథ విషయంలో త్రివిక్రమ్ వెరైటీ చూపించకపోతే ఈమూవీ పాటలు ఎంత హిట్ అయినా ప్రయోజనం ఉండదు అంటూ ఒక సరికొత్త నెగిటివ్ ప్రచారాన్ని కొందరు ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: