విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు దశాబ్దాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలారు. ఆ తరువాత నందమూరి తారకరామారావు వారసత్వాన్ని కొనసాగించడానికి రామారావు కుమారుల్లో చాలా మంది ప్రయత్నాలు చేసినా నందమూరి బాలకృష్ణ మాత్రమే అంతో ఇంతో సక్సెస్ అయ్యారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా బాలకృష్ణ నటించిన సినిమాలు హిట్ కావట్లేదు. బాలకృష్ణ మార్కెట్ కూడా సినిమా సినిమాకు తగ్గుతూ ఉండటం గమనార్హం. 
 
నందమూరి మూడవ తరం వారసుడైన జూనియర్ ఎన్టీయార్ నటనలోను, డైలాగ్ డెలివరీలోను, ఇతర విషయాల్లోను తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస విజయాలు సాధిస్తూ తాత నందమూరి తారక రామారావు పేరును నిలబెడుతున్న ఏకైక వారసుడుగా నిలుస్తున్నాడు. జూనియర్ ఎన్టీయార్ కెరీర్ తొలినాళ్లలోనే ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. 
 
ఆ తరువాత కొంతకాలం ఫ్లాపులతో సతమతమైన ఎన్టీయార్ యమదొంగతో ట్రాక్ లోకి వచ్చాడు. అదుర్స్, బృందావనం సినిమాలతో హిట్లు అందుకున్న ఎన్టీయార్ కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వలన మరలా ఫ్లాపులు పలకరించాయి. టెంపర్ సినిమా ఆడియో ఫంక్షన్ లో ఎన్టీయార్ మాట్లాడుతూ అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరిగే విధంగా సినిమాలు తీస్తానని మాట ఇచ్చాడు. 
 
ఎన్టీయార్ నటించిన టెంపర్ సినిమా సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ అయింది. నాన్నకు ప్రేమతో సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న తారక్ జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. జై లవకుశ లాంటి యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాను కూడా తారక్ తన అద్భుతమైన నటనతో నిలబెట్టాడు. అరవింద సమేత సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న తారక్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. నందమూరి మూడవ తరం వారసుల్లో తారక్ అంచెలంచెలుగా ఎదిగి తాతకు తగ్గ మనవడు అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: